భువనగిరి కేసులో బిగ్ ట్విస్ట్.. వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ల అక్రమ సంబంధమే కారణం !

-

భవ్య, వైష్ణవి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు టెన్త్ విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ మేరకు 10వ తరగతి చదువుతున్న భవ్య (15), వైష్ణవి (15), వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్‌లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థినులు హాస్టల్‌ వార్డెన్‌ శైలజకు ఫిర్యాదు చేశారు.

two female students in the same room of the hostel

కానీ, వార్డెన్ శైలజకు ఓ ఆటో డ్రైవరుతో అక్రమ సంబంధం ఉండగా ఆ విషయం భవ్య, వైష్ణవిలకు విషయం తెలిసిపోవడంతో వారిని వేధించారు వార్డెన్ శైలజ. అంతే కాకుండా మా మేడం శైలజ మంచిది.. ఆమెను ఒక్క మాట కూడా అనకండి అంటూ అనుమానపు సూసైడ్ లెటర్ రాశారు. ఈ క్రమంలో ఆ ఇద్దరిని హత్య చేసి ఫేక్ సూసైడ్ లెటర్ సృష్టించారని ఆరోపిస్తున్నారు తల్లితండ్రులు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకుని… వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు. మొత్తానికి భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు టెన్త్ విద్యార్థినులు ఆత్మహత్యకు ఓ అక్రమ సంబంధం కారణం ఐంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version