పుచ్చకాయతో కొత్త వంట..వద్దు బాబోయ్ అంటున్న నెటిజన్స్..

-

సోషల్ మీడియా పుణ్యమా అంటూ రోజుకో వింత జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది..వంటలకు సంభంధించిన రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి..ఈ వింత వంటలను చూసి ఆహార ప్రియులే వామ్మో అంటూ నోరెళ్లబెడుతున్నారు.చాక్లెట్ సమోసా.. టమోటా కచోరి, ఐస్ క్రీం కచోరి, వెజ్ ఫిష్ ఫ్రై, పచ్చి మిర్చి హల్వా, కొత్తిమీర ఐస్ క్రీం ఇలా ఒక్కటేమిటీ.. ఎన్నో రకాల వంటకాలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలో మరో సరికొత్త వంటకం నెట్టింట ట్రెండ్ అవుతోంది..పాప్ కార్న్ అందరికి తెలిసే ఉంటుంది. ఈ రకరకాల ఫ్లెవర్స్ తో అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా ఉప్పు, కారం తో స్పైసీగా ఉంటాయి..ఎప్పుడైనా పుచ్చకాయతో పాప్ కార్న్ ను రుచి చూశారా..అదొకటి ఉందనే సంగతి చాలా మందికి తెలియదు..ఈ వింత రుచిగల పాప్‌కార్న్ వీడియోను కప్తాన్ హిందూస్తాన్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. వైరల్ అవుతున్న వాటర్ మెలన్ పాప్‌కార్న్ వీడియోలో ఒక కళాయిలో నూనె మరుగుతోంది.

దానిలో ఒక వ్యక్తి పుచ్చకాయ ముక్కను వేస్తాడు. దానిని చిన్న చిన్న ముక్కలుగా విడదీస్తాడు. కొద్దిసేపటి తర్వాత నూనె ఎర్రగా కనిపిస్తుంది. ఈ నూనెలో మొక్కజొన్న ప్యాకెట్ ను వేస్తాడు. వెంటనే మొక్కజొన్న గింజలు పాప్ కార్న్‌గా మారడాన్ని చూడవచ్చు…అవి కాస్త పుచ్చకాయ కలర్ లో మారుతాయి..చూడటానికి చాలా కలర్ ఫుల్ గా కనిపించిన ఇవి టేస్ట్ ఎలా ఉంటాయో అని అందరికి సందేహం రావడం సహజం..దాని గురించి పూర్తిగా తెలియాలంటే మీరు ట్రై చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version