కేసీఆర్ వల్ల బానిసలుగా బతుకుతున్నాం: కోదండరామ్

-

సీఎం కేసీఆర్ నియంత్రత్వ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బానిసలుగా బతుకుతున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ నగరంలోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆత్మగౌరవ దీక్షకు తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ప్రొఫెసర్ కోదండరామ్

ఈ సందర్భంగా ప్రొ.కోదండరామ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి, విద్య, వైద్య రంగాల అభివృద్ధిలో విఫలమైందన్నారు. ప్రభుత్వం రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తే తప్పా.. ప్రభుత్వం అప్పులు తీరని దుస్థితి నెలకొందన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణానికి ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు చేసిందన్నారు. వీటి వల్ల రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. కేంద్ర ప్రభుత్వం అప్పులు ఇవ్వకపోతే.. రాష్ట్రంలో పథకాలు అమలు అయ్యే పరిస్థితిలో లేవన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. భవిష్యత్ కార్యచరణపై తేజస దీక్ష చేపడుతోందని, ప్రతిఒక్కరూ తప్పనిసరిగా హాజరుకావాలని ప్రొ.కోదండరామ్ కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version