అల్లు అర్జున్ కి మేము వ్యతిరేకం కాదు.. డీజేపీ సంచలన ప్రకటన

-

సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ ప్రస్తావన తీసుకురాగా.. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటన పై సినీ ప్రముఖులపై అసెంబ్లీలో సీఎం మానవీయ కోణంలో ఆలోచించాలని మాట్లాడారు. రేవతి అనే మహిళా మరణించిందని.. శ్రీతేజ అనే బాలుడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడని వారిని ఎవ్వరూ పరామర్శించలేదు. కానీ అల్లు అర్జున్ జైలుకు వెల్లి రావడంతో సినీ ప్రముఖులు క్యూ కట్టారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

మరోవైపు శనివారం రాత్రి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన విషయం తెలిసిందే. తాజాగా డీజీపీ జితేందర్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై స్పందించారు. “అల్లు అర్జున్ కి మేము వ్యతిరేకం కాదు. సంధ్య థియేటర్ లో డిసెంబర్ 04న రాత్రి తొక్కిసలాటలో ఓ మహిళా మరణించింది. ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలి. అల్లు అర్జున్ సినీ నటుడు కావచ్చు. కానీ క్షేత్ర స్థాయి పరిస్థితులు అర్థం చేసుకోవాలి. పౌరుల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యం కాదు.. ఆయన పై చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నాం. పౌరులంతా బాధ్యతాయుతంగా ఉండాలి” అని సూచించారు డీజీపీ. మరోవైపు మోహన్ బాబు కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఉన్నాయి. మీడియా ప్రతినిధి పై దాడి కేసులో మోహన్ బాబు పై చట్ట ప్రకారం చర్యలుంటాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version