2024లో క్రైమ్ రేట్ కొంత పెరిగింది : సీపీ ఆనంద్

-

హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదిక పై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. హైదరాబాద్ కమిషనర్ పరిధిలో అన్ని పండగలు ప్రశాంతంగా ముగిసాయి అని ఆయన అన్నారు. హోమ్ గార్డ్ నుండి సిపి వరకు అందరూ ఫాస్ట్ గా కష్టపడ్డారు.. అందరికీ కృతజ్ఞతలు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కూడా విజయవంతంగా పూర్తి చేసాం. క్రైమ్ రేట్ ఈ సంవత్సరం కొంత పెరిగింది. క్రైమ్ జరిగినప్పుడు ఏడు నిమిషాల కన్నా తక్కువ సమయానికి చేరుకుంటున్నాం. 129 పెట్రోల్ కార్స్, 210 బ్లు కోల్ట్స్ వాహనాలు, ఇంటర్ సెట్టర్ వాహనాలను కూడా విజిబుల్ పోలీస్ సింగ్ లో భాగస్వామ్యం చేశాం. గణేష్ ఉత్సవాలు తర్వాత సౌండ్ పొల్యూషన్ పై చర్యలు తీసుకున్నం. ఈ చర్యపై నగరవాసుల నుంచి మద్దతు లభించింది. ముత్యాలమ్మ గుడి ఇష్యూ తర్వాత నిరాశ్రయులను షెల్టర్ హోమ్కు తరలించాము.

ఈ సంవత్సరం మొత్తం 35944 ఎఫ్ఐఆర్లో నమోదయ్యాయి. గత సంవత్సరం ఈసారి 45% ఎఫ్ఐఆర్ ల శాతం పెరిగింది. మర్దర్లు 13 శాతం తగ్గాయి .. అటెంప్ట్ మర్డర్ కేసెస్ కూడా తగ్గాయి. కిడ్నాప్ కేసుల్లో 88% పెరుగుదల ఉంది. ఆస్తికి సంబంధించిన నేరాల్లో 67 శాతం పెరుగుదల ఉంది. నేరాలు డిటెక్ట్ చేసే పర్సంటేజ్ 59% ఉంది. రికవరీ పర్సంటేజ్ 58% ఉంది. 36 రకాల సైబర్ నేరాలు ఈ సంవత్సరం చూసాము. డిజిటల్ అరెస్టులు ఎక్కువ శాతం రిపోర్ట్ అవుతున్నాయి. 4042 సైబర్ క్రైమ్ లో నమోదు చేశాము.. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. 297 కోట్లు సైబర్ నేరాల్లో పోగొట్టుకున్నారు. 42 కోట్లు సైబర్ నెరకాల నుండి రికవరీ చేయగలి గాము. సైబర్ నేరాల్లో 30 శాతం కేసు డిటెక్షన్ పెరుగుదల ఉంది. 500 మంది కన్నా ఎక్కువ సైబర్ క్రిమినల్స్ ను అరెస్ట్ చేశాము అని సీపీ ఆనంద్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version