తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగానే పైలట్ గ్రామాల్లో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించింది. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సన్న బియ్యం పథకాన్ని మంగళవారం ఉదయం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు.రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల 263 రేషన్ దుకాణాల ద్వారా 2 లక్షల 91 వేల మంది లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.దానికి ముందు రైతులను, అధికారులను సన్నబియ్యం పంపిణీకి సంబంధించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..
రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల 263 రేషన్ దుకాణాల ద్వారా 2 లక్షల 91 వేల మంది లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ
– పొన్నం… pic.twitter.com/t9uLNP20mI
— BIG TV Breaking News (@bigtvtelugu) April 1, 2025