మాకి ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది.. నరేష్ వివాహం పై క్లారిటీ ఇచ్చిన పవిత్ర లోకేష్..!!

-

ప్రముఖ నటి పవిత్ర లోకేష్ కి, నటుడు నరేష్ కి వివాహ వ్యవహారాలపై పలు రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై ఇతర భాష మీడియాలో పవిత్ర లోకేష్ పలు సంచలన విషయాలను వెల్లడించింది. నరేష్ తో తన సహజీవనం గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక పవిత్ర లోకేష్ వాటి గురించి చూద్దాం.

పవిత్ర లోకేష్, నరేష్ ఇటీవల మహాబలేశ్వరంలోని ఒక స్వామీజీని దర్శించుకుని ఆ సందర్భంలో స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య వివాహ వార్త చాలా వైరల్ గా మారింది. అయితే నరేష్ తన మూడో భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో ఈ వివాహ వార్త పలు వివాదంగా మారింది. అయితే ఈ విషయంపై పవి* లో*ష్ మాట్లాడుతూ.. నన్ను ఒక కుటుంబ సభ్యురాలుగా నరేష్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారని.. మా ఇద్దరి సహజీవనం రిలేషన్ షిప్ కు కృష్ణ ఫ్యామిలీ ఆమోదం ఉంది అని తెలిపింది.

అందుకే మేము వివాహం చేసుకోవడానికి కాస్త ఆలోచిస్తున్నాము.. ఫామ్ హౌస్ లో కృష్ణ ,నరేష్ మేము కలసి ఉంటున్నామని పవిత్ర తెలియజేయడం జరిగింది. ఇక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పై పవిత్ర లోకేష్ మాట్లాడుతూ.. రమ్య సరిగ్గా ఉంటే నరేష్ కుటుంబం ఆమె వెంటే ఉండేది. ఆమెను నేను చాలా దూరం నుండి చూశాను కానీ ఆమె తీరు ప్రవర్తన మాత్రం అంతగా నచ్చలేదు అని తెలిపింది. తన భర్తతో మాత్రం కలిసి ఉండలేనని ఆమె తెగేసి చెప్పినట్లుగా తెలిపింది. అలా ఆమె జీవితంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపింది పవిత్ర.

తన భర్తగా చెప్పుకుంటున్న కన్నడ దర్శకుడు సుఖేంద్ర పవిత్ర లోకేష్ కు వివాహం కాలేదని కేవలం మా ఇద్దరి అంగీకారంతోనే రిలేషన్ లో ఉన్నామని దాంతో మాకు విడాకుల సమస్య లేదని తెలిపింది. ఇక అంతే కాకుండా ఆయన కుటుంబ సభ్యులకు కూడా తనతో ఇప్పటికీ సన్నిహితంగా ఉన్నారని తెలిపింది. ఇక నరేష్ తో అనుబంధంతో మాట్లాడుతూ నరేష్ అబద్ధాలు చెప్పడని మోసం చేసినట్టుగా తనకి ఎక్కడా కనిపించలేదని. కృష్ణ అతని కుటుంబంతో ప్రస్తుతం వీరు చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది. ఇక నరేష్ మూడో భార్య రమ్య వ్యక్తిగత జీవితంలో నేను అసలు తల దూర్చనని.. ఆమెతో నరేష్ మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని పవిత్రలోకేష్ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version