మాకు ధోనీ లాంటి ఆటగాడు కావాలి: ఆస్ట్రేలియా ఆటగాడు

-

ఇంగ్లాండ్ పై టి 20 మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ కీలక వ్యాఖ్యలు చేసాడు. ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఘోరంగా ఫెయిల్ అవ్వడంతో… తమకు టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లాంటి మంచి ఫినిషర్ కావాలని అతను కామెంట్ చేసాడు. తను ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆటగాడు అని అన్నాడు. ఎందుకంటే అతను 400 వన్డే మ్యాచ్ లను ఆడాడు అని కీర్తించాడు.

చేతిలో 9 వికెట్లతో 35 బంతుల్లో 39 పరుగులు అవసరమయ్యాయి కాని ఆస్ట్రేలియా టార్గెట్ చేధించలేదు. ఆ జట్టు కీలక ఆటగాడు అయిన మార్కస్ స్టోయినిస్ చివరి ఓవర్ లో 15 పరుగులు చేయలేకపోయాడు. మార్కస్ స్టోయినిస్ గత బిగ్ బాష్ లీగ్ సీజన్ లో మెల్బోర్న్ స్టార్స్ తరుపున మంచి ప్రదర్శనే చేసాడు. 705 పరుగులు చేసి బిబిఎల్‌ లో అగ్ర స్థానంలో నిలిచాడు. అతని ఆట తీరుపై ఫాన్స్ మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version