ఫార్మసిస్ట్ నాగాంజలికి మృతికి న్యాయం చేస్తాం..రూ.2లక్షల ఆర్థిక సాయం : ఎమ్మెల్యే ఆదిరెడ్డి

-

రాజమండ్రి కిమ్స్ ఆస్పత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ లైంగికంగా వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం చేసి వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న ఫార్మసిస్ట్ నాగాంజలి మృతి చెందింది. శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు.

కాగా, ఫార్మాసిస్ట్ నాగాంజలి కుటుంబ సభ్యులను రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి పరామర్శించారు. నాగాంజలి మృతికి కారణమైన వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. తనవంతుగా నాగాంజలి కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.హోం మంత్రి అనిత, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి నాగాంజలి కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news