42 సీట్ల‌లో మేమే పోటీ చేస్తాం: మమత బెనర్జీ

-

వెస్ట్ బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్ల‌లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ది. పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ మొత్తం 42 స్థానాల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుంద‌ని ఊహాగానాలు వినిపిస్తున్నా.. ఆ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. తృణ‌మూల్ కాంగ్రెస్‌కు చెందిన రాజ్య‌స‌భ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ కీలక వ్యాఖ్య‌లు చేశారు.

 

బెంగాల్ సీఎం వచ్చే పార్లమెంట్ ఎన్నిక‌ల్లో 42 స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సుముఖం ఉంద‌ని ఆయన తెలిపారు. అస్సాంలో కొన్ని సీట్లు, మేఘాల‌యాలోనూ పోటీ చేయ‌నున్న‌ట్లు ,దీనిలో ఎటువంటి మార్పులు ఉండ‌బోవ‌ని ఒబ్రెయిన్ ఇటీవ‌ల వెల్లడించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి ఇటీవ‌ల ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో సీట్ల పంప‌కంపై ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఉత్తర ప్రదేశ్ దేశ్లో ఎస్పీతో క‌లిసి కాంగ్రెస్ పోటీచేయ‌నున్న‌ది. ఇక ఢిల్లీ, హ‌ర్యానా ,గుజ‌రాత్‌, గోవా,రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీతో క‌లిసి ప‌నిచేయ‌నున్న‌ది.

Read more RELATED
Recommended to you

Exit mobile version