తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలతో కలిసి వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఎన్డీఏ ఫ్యామిలీలో చేరాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని తెలిపారు. డైనమిక్ & దూరదృష్టి కలిగిన ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ప్రగతికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం టిడిపి జనసేన బిజెపి కలిసి పని చేస్తాయని ఆయన వెల్లడించారు.
ఇదిలా ఉండగా….టీడీపీ-జనసేనతో తమ పొత్తును కన్ఫర్మ్ చేసిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా.. ఒకట్రెండు రోజుల్లో సీట్ల కేటాయింపుపై ప్రకటన ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రజల సపోర్ట్ వారి అంచనాలను తమ కూటమి అందుకుంటుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు కలిపి 30 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలను సర్దుబాటు చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై రేపు లేదా ఎల్లుండి స్పష్టత వచ్చే ఛాన్సుంది.