దేశంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా ప్రవేశిస్తున్నాయి. ఈ నైరుతి రుతుపవనాలు ఉత్తర దిశగా పయనమై.. లాంగ్ ఐలాండ్స్ నుంచి ఉత్తర అక్షాంశం, తూర్పు రేఖాంశం వరకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం వల్ల నేటి నుంచి రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నైరుతి రుతుపవనాలు.. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ దీవులతోపాటు తూర్పు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించనున్నాయి. దీని ఫలితంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాల నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంది.