వీకెండ్ విండో : అన్న‌గారు చెప్పేదిదే ! ఓవ‌ర్ టు బాల‌య్య

-

తిరుప‌తిలో వెంక‌న్న ద‌ర్శ‌నం
చెన్న‌ప‌ట్నం (ఇప్ప‌టి చెన్న‌య్)లో అన్న‌గారి ద‌ర్శ‌నం
చేసుకుని రావాలి..ఈ రెండూ ఎంతో ముఖ్యం ఆ రోజు ఆయ‌న అభిమానులకు..ఆయ‌న ఆరాధ‌కుల‌కు.. ఆ వివ‌రం ఈ క‌థనంలో !

జీవితంలో చెప్పుకోద‌గ్గ ప‌రిణామాలు కొన్నే ఉంటాయి. జీవితంలో నేర్చుకోద‌గ్గ ప‌రిణామాలు కొన్నే ఉంటాయి. బిడ్డ‌ల‌కు సంప‌ద‌లు మాత్ర‌మే ఇచ్చే త‌ల్లిదండ్రుల కార‌ణంగా ఎన్నో స‌మ‌స్యలున్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి న‌ట దిగ్గ‌జాలు బిడ్డ‌ల‌కు కొన్ని విలువలు నేర్పారు. ఆ విధంగా ఆ ఇద్ద‌రూ న‌చ్చుతారు. చిత్ర సీమ‌లో రాణించాల‌ని అనుకునే వారు త‌మ‌కు తెలియాల్సింది న‌ట‌న ఒక్క‌టే కాదు ఇంకా ఎన్నో ! జీవితాన్ని న‌డిపించి వెళ్లేది క్ర‌మ‌శిక్ష‌ణ మాత్ర‌మే అని ఎన్నో సార్లు చెప్పారు. ఆ విధంగా తెలుగు జాతి గ‌ర్వించ‌దగ్గ సినిమాలే తీశారు. స్మ‌ర‌ణీయ రూపాల‌లో వారిద్దరూ ఉంటారు.

అందుకే బాల‌య్య‌కు బాబాయ్ ఏఎన్నార్ అన్నా ఎంతో గౌర‌వం. బాల‌య్య అంటే అక్కినేని అభిమానుల‌కే కాదు ఇండ‌స్ట్రీలో ఎంద‌రికో ఇష్టం.. అందుకు కార‌ణంగా కూడా ఆయ‌న క్ర‌మ‌శిక్ష‌ణే. ఓ క‌థ విన్న‌ప్పుడు తానేం అనుకుంటారో త‌ప్ప‌క చెబుతారు. త‌రువాత డైరెక్ట‌ర్ ఏం చెబితే అదే చేసి వెళ్తారు. ఆయ‌న కెమెరా ఎదుట ఉన్న‌ప్పుడు త‌న వృత్తిని దైవం తో స‌మానంగా భావిస్తారు. న‌ట జీవితం ఒక్క‌టే కాదు త‌న ఆల‌యం బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి నిర్వ‌హ‌ణ విష‌య‌మై కూడా ఎంతో శ్ర‌ద్ధ వ‌హిస్తారు. ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు.

న‌ట‌సింహం బాల‌య్య కొత్త సినిమా సంగతుల‌తో ఈ వారాంతం కొత్త హుషారు అందుకుంది. నంద‌మూరి అభిమానుల‌కు ఆయ‌న ఓ పెద్ద పండుగ‌నే తీసుకు వ‌స్తున్నారు. నిత్య కృషికి నిత్య స్ఫూర్తికి తార్కాణం అని వివ‌రించే, విశ‌దీక‌రించే వ్య‌క్తి ఎన్టీఆర్ ను ఆద‌ర్శంగా తీసుకునే వారికి నిజంగానే ఇది ఒక శుభ‌వార్త. జీవితం ఎన్నో నేర్పి వెళ్తుంది. కొన్నే మంచి కొంతే మంచి.. ఆ విధంగా ఎన్టీఆర్ అనే ఓ ప్ర‌బ‌ల శ‌క్తి తెలుగు వారి ఆరాధ్య దైవం. సినిమాను మాత్ర‌మే కాదు ఆయ‌న జీవితం కూడా ప్రేమించే వారు ఉన్నారు. వ్య‌క్తిగ‌త జీవితంలో క్ర‌మ‌శిక్ష‌ణ ఉంది. స‌మ‌య పాల‌న త‌ప్ప‌ని నైజం ఉంది.

ఎన్నో సంద‌ర్భాల్లో అవ‌మానాలు దాటుకుని జీవించిన దాఖ‌లాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే త‌ర‌గ‌ని చెర‌గ‌ని ఆత్మ గౌర‌వం ఆయ‌న‌లో ఉంది. అది క‌డ‌దాకా ఉంది. అందుకే ఆయ‌న ఆంధ్రుల ఆరాధ్య దైవం. ఎన్టీఆర్ అంటే సాహ‌సం అని అంటారు. ఆయ‌న నిజంగానే సాహ‌సం. ఏం చేసినా సాహ‌స‌మే ! కాలానికి ఎదురువెళ్లి ఆయ‌న ఎన్నో విజ‌యాలు అందుకున్నారు. ఆ విధంగా ఆయ‌న అన్న‌గారు.. అఖిలాంధ్ర కోటికి అన్న‌గారు. అందుకే ఇదే టైటిల్ తో బాల‌య్య సినిమా చేస్తున్నారు. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. గోపీచంద్ మ‌లినేని రూపొందిస్తున్నారు. అన్న‌గారూ ! ఆల్ ద బెస్ట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version