కొంతకాలం నుండి ప్రపంచ వ్యాప్తంగా మీరు సరిగా గమనిస్తే చాలా MNC కంపెనీలు తమ ఉద్యోగులను చాలా వరకు తగ్గించుకోవడానికి చూస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. తాజాగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం చేసిన ఒక సర్వే ఉద్యోగాలకు కునుకులేకుండా చేస్తోంది. ఈ ఫోరం దాదాపుగా 45 దేశాలలో ఉన్న 803 కంపెనీ లపై సర్వే చేసిందట. 2027 సంవత్సరం కల్లా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 8.3 కోట్ల మంది ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉందని సదరు సర్వే తెలిపింది.
సంచలన వార్త: 2027 కల్లా 8.3 కోట్ల మంది ఉద్యోగులు ఔట్ !
-