రాజధాని రైతులకు శ్రేయోభిలాషుల సూచన!

-

నలభై రోజుల క్రితం ద్విశతదినోత్సవ హడావిడి చేశారు టీడీపీ నేతలు మరియు రాజధాని రైతులు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీడీపీ కర్యకర్తలు, అభిమానులు ఆన్ లైన్ లో నిరసనలు తెలిపారు. అమరావతిలోనే పూర్తి రాజధాని ఉండాలంటూ హడావిడి చేశారు! అనంతరం మళ్లీ 300వ రోజుకోసం చూస్తున్నారో ఏమోకానీ… టీడీపీ నుంచి ఆశించిన స్థాయిలో సందడి కరువైంది!! దీంతో… అసలు రజధాని రైతులకు ఏమి కావాలి అనే అంశంపై రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

తాజాగా రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 240వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడం, దొండపాడు తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అంతవరకూ బాగానే ఉంది కానీ… రాజధాని రైతులు రాజకీయ క్రీడల్లో బలవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు! ఎట్టిపరిస్థితుల్లోనూ అమరావతిలోనే పూర్తి రాజధానీ ఉండదని.. అది సాధ్యం కాదని చెబుతోంది అధికార వైసీపీ! దానికోసం తగిన ఏర్పాట్లు చూసుకుంటూ ముందుకుపోతుంది!

ఈ క్రమంలో ఏపీ పరిపాలనా రాజధాని కచ్చితంగా విశాఖకు వెళ్తుందన్న విష్యం ఆల్ మోస్ట్ కన్ ఫాం అయిపోయిందన్న విషయం తెలిసి కూడా చంద్రబాబు… వాస్తవాలు చెప్పకుండా రాజధాని రైతులను ఇంకా ఏమార్చుతున్నారని అంటున్నారు. దీక్షలు చేస్తోన్న రోజుల సంఖ్య పెరిగిపోతున్నా… ఫలితం శూన్యంగా కనిపిస్తోన్నవేల… రైతుల తరుపున పెద్ద మనిషిగా ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిన చంద్రబాబు… కేవలం విమర్శలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఫలితంగా రాజకీయ పార్టీల ఎత్తులు పై ఎత్తుల మధ్య రైతులు బలవుతున్నారనే కామెంట్లు పడుతున్నాయి!

కాబట్టి ఇప్పటికైనా రాజకీయ పార్టీల మాటలు వినకుండా… రాజధాని రైతులంతా ఒక తాటిపైకి వచ్చి… ప్రభుత్వంతో చర్చలు జరుపుకుని.. వారి సమస్యలకు ఏదో ఒక పరిష్కారం తెచ్చుకోవడం ఉత్తమమనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందనే విషయాన్ని రాజాధాని రైతులు గ్రహించాలని.. మొండిగా ఉండటం.. దీక్షల రోజుల సంఖ్య పెంచుకోవడం వల్ల ఫలితం ఉండదని.. రైతుల శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version