పశ్చిమ బెంగాల్ పంచాయతీ శాఖ మంత్రి , తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుబ్రతా ముఖర్జీ (75) గురువారం రాత్రి కన్నుమూశారు. సుబ్రతా ముఖర్జీ గత కొంత కాలంగా అనారోగ్య సమస్య ల తో బాధ పడుతున్నాడు. అయితే ఆయన బెంగాల్ ఉన్న ప్రముఖ ఎస్ఎస్ కే ఎం అనే ఆస్పత్రి లో కొద్ది రోజు ల నుంచి చికిత్స తీసుకుంటున్నాడు.
అయితే అనారోగ్య సమస్యలు ఎక్కువ అయి గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని పశ్చమ బెంగల్ రాష్ట్ర ముఖ్య మంత్రి మమతా బెనర్జీ అధికారికంగా ప్రకటించారు. ఆయన మరణం తమ ప్రభుత్వానికి, తమ పార్టీ కి తీరని లోటని మమతా బెనర్జీ అన్నారు. అలాగే తమ మిత్తుడు సుబ్రతా ముఖర్జీ లేరు అనే వార్త జీర్ణం అవడం లేదని వాపోయారు.
సుబ్రతా ముఖర్జీ చాలా నిబద్ధత కూడిన వ్యక్తిత్వం అని కొనియాడారు. అయితే సుబ్రతా ముఖర్జీ మరణం వ్యక్తి గతంగా మమతా బెనర్జీ చాలా నష్టం చేకురుతుందని తెలిపారు. అయితే సుబ్రతా ముఖర్జీ కి గత కొద్ది రోజుల నుంచి శ్వాస సంబంధి మైన సమస్యలు వస్తున్నాయి. దాని కోసమే సుబ్రతా ముఖర్జీ ని ఆస్పత్రి లో ఐసీయూ లో ఉంచారు. కానీ గురువారం రాత్రి ఈ సమస్య ఎక్కువ కావడం తో ఆయన మరణించారు.