కూల్ డ్రింక్ తాగినప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది..? రెగ్యులర్ గా తీసుకుంటే జరిగేది ఇదే..!

-

చాలా మంది కూల్ డ్రింక్స్ ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు. కూల్ డ్రింక్స్ ని తాగడం వలన ఒంట్లో ఎలాంటి మార్పులు వస్తాయి..? కూల్ డ్రింక్ ని తాగితే ఏమవుతుంది అనే దాని గురించి చూద్దాం. ప్రజలు సాఫ్ట్ డ్రింక్స్ ని దాహం వేసినప్పుడు ఎక్కువగా తీసుకుంటుంటారు. వ్యాపార ప్రకటనల్లో కూడా దాహం వేసినప్పుడు తీసుకోవాలన్నట్లు చూపిస్తారు. శరీరంలో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు మనకి దాహం కలుగుతుంది. దాహం వేయడం, తీరడం అనే భావన మనం మైండ్ లో హైపో థలమస్ గ్లాండ్ చూస్తుంది. ఆ టైంలో శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోవడం వలన దాహం వేయకుండా అది ఫుల్ ఫిల్ అవుతుంది. సాఫ్ట్ డ్రింక్స్ తాగినప్పుడు నీరు అందకుండానే దాహం తీరుతుంది.

అయితే ఇలా జరగడం వల్ల ఏమవుతుంది అంటే నీటి శాతం తక్కువైపోతుంది. బీపీ తగ్గిపోవడం, అవయవాలకు రక్త సరఫరా తగ్గిపోవడంతో పాటుగా కిడ్నీ సమస్యలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వంటివి కలుగుతాయి. ఈ కూల్డ్రింక్స్ లో 90 నుంచి 99 శాతం వాటర్ ఉంటుంది. అలాగే తీపి పదార్థాలు, చక్కెర, కృత్రిమ రంగులు, కార్బన్ డయాక్సైడ్ కూడా ఉంటాయి. కార్బోనేటెడ్ డ్రింక్స్ లో కార్బన్ డయాక్సైడ్ అధిక పీడనం వద్ద నీళ్లలో కలపడం జరుగుతుంది. దీని కారణంగా బుడగల రూపంలో కూల్ డ్రింక్స్ ఉంటాయి.

దీనిని తాగడం వలన స్పర్శ లాంటి అనుభూతి వస్తుంది. మీరు కూల్ డ్రింక్స్ కాకుండా సోడా వంటివి తీసుకున్న కూడా ఇదే ఫీలింగ్ కలుగుతుంది నిజంగా శరీరానికి కావాల్సినంత నీరు మాత్రం అందదు. కూల్ డ్రింక్స్ తో తాగడం వలన పంటికి సమస్యలు వస్తాయి. అలాగే అందులో షుగర్ ఎక్కువ ఉండడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కూల్ డ్రింక్స్ లో పోషకాలు ఉండవు. క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కూల్ డ్రింక్స్ ని తాగడం వలన నిద్రలేమి సమస్యని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కూల్ డ్రింక్స్ ని దగ్గర తీసుకోవడం వలన ఈ సమస్యలు తప్పవని గుర్తుపెట్టుకోండి. దాహం వేసినప్పుడు ముందు మంచినీళ్లు మంచిగా వంటివి తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version