క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్‌ను త‌యారుచేస్తారా..? చేయ‌క‌పోతే ఏమ‌వుతుంది..?

-

క‌రోనా మ‌హమ్మారికి బెంబేలెత్తిపోతున్న ప్ర‌పంచ ప్ర‌జ‌లు ఇప్పుడు ఎదురు చూస్తుంది.. ఒక్క దాని గురించే.. అదే క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌.. దాని గురించి ఎలాంటి వార్త వ‌చ్చినా జ‌నాలు ఆస‌క్తిగా చ‌దువుతున్నారు. కరోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వ‌చ్చిందా..? ఇంకెన్నాళ్లీ భ‌యం..? ఇంకెన్ని రోజులు ఈ లాక్‌డౌన్‌లో ఉండాలి..? ఇంకా ఎంత కాలం స‌మ‌స్య‌లు ఎదుర్కోవాలి..? అని జ‌నాలు లెక్క‌లు వేస్తున్నారు. అయితే క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్‌ను.. నేడో.. రేపో.. కొన్ని రోజుల‌కో త‌యారు చేసి.. దాన్ని అంద‌రికీ ఇస్తే.. ఓకే.. హమ్మ‌య్య‌.. బ‌తికుంటే బ‌లుసాకు తిని బ‌త‌క‌వ‌చ్చు.. పెద్ద గండం త‌ప్పింది.. అని అంద‌రూ ఊపిరి పీల్చుకోవ‌చ్చు.. కానీ సీన్ రివ‌ర్స్ అయితే..? అంటే.. క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్‌ను త‌యారు చేయ‌క‌పోతే..? అస్స‌లు ఎంత కాలం ఉన్నా.. దానికి వ్యాక్సిన్ త‌యారు చేయ‌లేక‌పోతే..? అప్పుడెలా..? అలాంటి సంద‌ర్భంలో ఎలాంటి విప‌రీత ప‌రిణామాలు ఏర్ప‌డుతాయి..? అంటే…

క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్‌ను త‌యారు చేయ‌క‌పోతే.. దాన్ని నాశ‌నం చేయ‌డం ఒక్క‌టే మార్గం.. అది కూడా పూర్తి లాక్ డౌన్ ద్వారా.. వైర‌స్ వ్యాప్తి చెయిన్‌ను బ్రేక్ చేస్తేనే.. ఆ వైర‌స్ న‌శిస్తుంది.. లేదంటే.. ప్ర‌పంచం మొత్తానికి క‌రోనా వ‌స్తుంది.. ఈ క్ర‌మంలో జ‌నాల‌కు వైద్యం చేసేందుకు వైద్యులు, స‌దుపాయాలు, సిబ్బంది ఉండ‌రు. దాంతో అన్ని దేశాల ప్ర‌భుత్వాలు చేతులెత్తేస్తాయి. అప్పుడు మాన‌వ వినాశనానికి ప‌రిస్థితులు దారి తీస్తాయి. కొంత కాలానికి భూమిపై మ‌నుషులు అన్న‌వారు లేకుండా పోతారు. ప్ర‌పంచం మొత్తం అంత‌మైపోతుంది. కానీ.. అలాంటి స్థితి రాకుండా ఉండాల‌నే.. ఇప్పుడు మ‌న‌మంద‌రం కోరుకునేది.

అయితే ఈ వైర‌స్‌కు వ్యాక్సిన్‌ను త‌యారు చేస్తే.. ఆ త‌యారు చేసిన దేశం ఇత‌ర దేశాలకు దాన్ని ఇవ్వాలి. లేదంటే.. అప్పుడూ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కానీ ప్ర‌పంచ దేశాలు అలా ఆలోచిస్తాయ‌ని మ‌నం అనుకోలేం. ఏది ఏమైనా.. మ‌న‌కు ఇప్పుడు వ‌చ్చిన క‌రోనా ముప్పు.. అత్యంత తీవ్ర‌మైంది. ఈ ముప్పును వ‌ర్ణించ‌డం కోసం తీవ్రం అన్న ప‌దాన్ని వాడ‌డం కూడా ఇంకా త‌క్కువే అవుతుంది. అంత‌కు మించి ఎన్నో రెట్లు ఎక్కువ ముప్పులో ఇప్పుడు మ‌నం ఉన్నాం.. ఈ ముప్పు నుంచి త్వ‌ర‌గా మ‌నం బ‌య‌ట ప‌డాల‌ని కోరుకుందాం..!

Read more RELATED
Recommended to you

Exit mobile version