అల్లు శిరీష్ ఎందుకు అలా చేస్తున్నాడు..!!

-

హీరో అల్లు శిరీష్ ఎంతగా కష్టపడుతున్న గాని హిట్ మాత్రం రావడం లేదు. అల్లు అరవింద్ వంటి మాంచి హ్యాండ్ వున్నా కూడా హీరో కెరియర్ ముందుకు వెళ్లడం లేదు. ఇక తాను అను ఇమ్యాన్యుయేల్ హీరోయిన్ గా నటించిన ఊర్వశివో రాక్షశివో సినిమాకు మొదట్లో  మంచి టాక్ వచ్చింది సినిమాలో  బెడ్ రూం సీన్స్,లిప్ లాక్ సీన్ లు వుండటం ఈ సినిమాకు మరింత ప్లస్ గా మారాయి. దీంతో ఈ సినిమా యూత్ ను థియేటర్లు కు రప్పించింది.

ఈ మూవీ  మొదటి మూడు రోజులు  మంచి వసూళ్లని రాబట్టింది. హాట్ హాట్ సన్నివేశాలలో అను ఇమ్యాన్యుయేల్  అల్లు శిరీష్‌ సరసన నటించడంతో వారిద్దరు మధ్య ఎఫైర్ ఉన్నట్లు ప్రచారం చేశారు. కాని మంచి టాక్ వచ్చిన సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోలేక బోల్తా పడింది. ఒక పక్క అల్లు శిరీష్ అన్న అల్లు అర్జున్ ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ అందుకున్నాడు.

కాని అల్లు శిరీష్ కు మాత్రం హిట్ రావడం లేదు. ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు పోలికలు రావటం కామన్. ఇక ఈ జరిగే ట్రోలింగ్ తో తట్టుకోలేక చాలా రోజులు గా ఒక్కడే బయట విడిగా ప్లాట్ లో వుంటున్నాడు. తన సినిమాలు కూడా తానే స్వంతంగా నిర్మించే పనిలో ఉన్నాడట.ఇటీవలే అల్లు శిరీష్ సోషల్ మీడియాకు కూడా గుడ్ బాయ్ చెప్పడంతో సోషల్ మీడియాలో కూడా శిరీష్ కనిపించడం లేదు. దీంతో అసలు అల్లు కాంపౌండ్ లో ఏం జరుగుతుంది అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version