రాముడి విగ్రహాన్ని తీసి మసీదు కట్టారా…? చీకట్లో రాముడి విగ్రహం తెచ్చి పెట్టారా…? అయోధ్య వివాదం ఏంటి…?

-

అయోధ్యలో రామమందిర వివాదం ఏంటి…? ఇప్పుడు దీని గురించే దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ వివాదం ఇప్పటిది కాదనేది చరిత్ర చెప్తుంది. 16 శాతాబ్దం నుంచే ఈ వివాదం నడుస్తుంది అనేది హిందువుల వాదన. అసలు అప్పుడు ఏం జరిగింది… హిందువులు ఏం చెప్తున్నారు…? ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లా అయోధ్య నగరంలో ఒక భూభాగం కేంద్ర బిందువుగా నడుస్తున్న వివాదం ఇది. హిందూ మతం అమితంగా ప్రాధాన్యత ఇచ్చే రాముడి జన్మస్థలంగా హిందువులు భావిస్తూ ఉంటారు. అయితే ఆ స్థలంలో…

16వ శతాబ్దంలో ఓ ముస్లిం ఆక్రమణదారు అక్కడ హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ మసీదును నిర్మించారనేది ఎప్పటి నుంచో హిందువుల ప్రధాన వాదన. ఇక్కడ హిందువుల వాదన ఒక్కసారి చూస్తే… 1949 వరకూ తాము ప్రార్థనలు చేశామని.. అయితే ఆ ఏడాది కొంత మంది రాత్రి వేళ చీకట్లో రాముడి విగ్రహాలను తెచ్చి ఆ మసీదులో పెట్టారనేది ముస్లిం వర్గాల వాదన. ఇక అప్పటి నుంచి ఈ వివాదం నడుస్తూనే ఉంది. బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6వ తేదీన ధ్వంసం చేశారు. బిజెపి, విశ్వహిందు పరిషత్ తో పాటు గా…

కొన్ని హిందుత్వ సంస్థలకు చెందిన నేతలు లక్షలాది గా కరసేవకులతో వెళ్లి బాబ్రీ మసీదుని కూల్చి వేసారు. వారిలో ఎల్కే అద్వాని, ఉమాభారతి, మురళి మనోహర్ జోషి వంటి సీనియర్ నేతలు ఉన్నారు. ప్రధానంగా అద్వాని ప్రసంగాలే బాబ్రీ మసీదుని కూల్చడానికి ప్రధాన కారణమని ముస్లింలు భావిస్తూ ఉంటారు. ఆ ఘటన నేపథ్యంలో జరిగిన మత అల్లర్లలో దేశవ్యాప్తంగా దాదాపు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వివాదంపై అప్పుడు అలహాబాద్ కోర్ట్ లో కేసు నమోదు కాగా దాదాపు 20 ఏళ్ళ తర్వాత కోర్ట్ ఒక సంచలన తీర్పు ఇచ్చింది.

అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించాలని.. అందులో ఒక భాగం హిందూ మహా సభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, రెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో భాగం నిర్మోహి అఖాడాకు చెందుతుందని అప్పుడు తీర్పు ఇచ్చారు. కాని హిందువులు మాత్రం అక్కడ రాముడి గుడి మాత్రమే ఉండాలి అంటూ పట్టు బట్టి సుప్రీం లో పిటీషన్ దాఖలు చేసారు. నేడు ఆ పిటీషన్ పై తీర్పు వెలువడనుంది. దీనితో దేశ వ్యాప్తంగా ఏం జరుగుతుందో అనే ఆందోళన అందరిలోనూ నెలకొంది. సుప్రీం తీర్పిపై ఏమై ఉంటుందో అని ప్రపంచం ఆశగా ఎదురు చూస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version