ఇప్పుడు కరోనా దేశాన్ని భయపెడుతుంది. ఇప్పుడుఇప్పుడే కరోనా కేసుల ప్రభావం క్రమంగా దేశం మీద ఎక్కువగా పడుతుంది. ఊహించని విధంగా కరోనా కేసులు పలు రాష్ట్రాల్లో పెరగడం తో కేంద్రం హాట్ స్పాట్స్ ని గుర్తించింది. అలాగే రాష్ట్రాలు కూడా ఇప్పుడు కరోనా హాట్ స్పాట్స్ ని గుర్తించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆసలు ఈ హాట్ స్పాట్ అంటే ఏంటీ…? ఈ స్టోరీలో చూద్దాం…
హాట్ స్పాట్ అంటే జిల్లా లేదా ఒక ప్రాంతంలో ఆరు లేదా అంతకంటే ఎక్కువ మంది కరోనా పాజిటివ్ వస్తే ఆ ప్రాంతాన్ని హాట్ స్పాట్ గా గుర్తించారు. ఆ ప్రాంతం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అధికారులు, ప్రభుత్వం. అక్కడ ఏ కార్యాకలాపాలు జరగడానికి వీలు లేదు. లోపల ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళడానికి లేదు, బయట వాళ్ళు ఆ ప్రాంతంలోకి వచ్చే అవకాశం లేదు. కనీసం కిరాణా, మందులకు కూడా ప్రజలను బయటకు రానీయరు.
మీడియాను కూడా అనుమతించే అవకాశం ఉండదు. ఆ ప్రాంతం మొత్తం ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ప్రతీ ఇంటిని పర్యవేక్షిస్తారు అధికారులు. ప్రత్యేక అంబులెన్స్ లు అందుబాటులో ఉంటాయి. అత్యవసర సేవలను ఆ ప్రాంతంలోనే ఉంచుతారు. అలాగే శానిటైజేషన్ చేస్తారు. ప్రజలు ఎవరూ కూడా బయటకు రానీయకుండా ప్రతీ ఇంటిని నిఘాలో ఉంచుతారు. తెలంగాణాలో మొత్తం 125 హాట్ స్పాట్స్ ని గుర్తించారు.