జమున అసలు పేరు ఏమిటి? మార్చడానికి గల కారణం ఇదేనా..?

-

ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ జమున తాజాగా హైదరాబాదులోని తన స్వగృహంలో స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలిసి సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది . ఈ సందర్భంగా ఆమె గురించి మనకు తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయకులుగా కొనసాగిన ఎంతోమంది తమ నటన ప్రతిభతో పరిశ్రమలోనూ.. ప్రేక్షకులలోను తమకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. అలాంటివారిలో జమున కూడా ఒకరు.. నిజానికి మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు నేలపై ఎదిగి సినీపరిశ్రమలో అరుదైన అగ్ర కథానాయకగా గుర్తింపు తెచ్చుకున్నారు.

1937 లో కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో జన్మించిన ఈమె.. కుటుంబ సభ్యులు ఆంధ్రకు వెళ్లడంతో గుంటూరు జిల్లా దుగ్గిరాలలో బాల్యం గడిచింది. అసలు పేరు జానా బాయ్.. అయితే జన్మ నక్షత్రాన్ని బట్టి ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్యులు చెప్పడంతో ఆమె పేరు మధ్యలో ము అనే అక్షరాన్ని చేర్చి జమునగా పేరు మార్చారు. నటుడు జగ్గయ్యది కూడా అదే గ్రామం కావడంతో జమున కుటుంబానికి ఆయనతో కొంత పరిచయం ఏర్పడింది. చదువుకునే రోజుల నుంచి నాటకాలపై ఆసక్తి పెంచుకున్న జమున నాటకాల్లో పాల్గొనాలని కోరిక పెంచుకుంది. తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో ఖిల్జీరాజాపట్టణం అనే నాటకానికి జగ్గయ్య ప్రత్యేకంగా జమునను ఎంపిక చేశారు.

ఆ నాటకంలో మరో నటుడు గుమ్మడి కూడా నటించారు. ఆ నాటకమే కాకుండా పలు నాటకాలలో కూడా నటించారు . ముఖ్యంగా ఆమె ప్రతిభ నాటకాల ద్వారా నలుమూలలకు పాకడంతో సినిమా ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఎన్టీఆర్ను మొదలుకొని కృష్ణ , శోభన్ బాబు వంటి హీరోల సరసన నటించి మెప్పించింది జమున.

Read more RELATED
Recommended to you

Exit mobile version