నో షేవ్ నవంబర్ గురించి ఎంతమందికి తెలుసు..?

-

ఇంటర్నెట్ వచ్చాక ఎక్కడ ఏ విషయం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఇక సోషల్ మీడియా వచ్చాక ఎవ్వరితోనైనా మాట్లాడగలుగుతున్నాం. నచ్చని వాటి గురించి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. సామాన్యులకి సెలెబ్రిటీలకి మధ్య దూరం చాలా తగ్గింది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఒక్క క్లిక్ లొ తెలుసుకుంటున్నాం. ఎంతో దూరంలో ఉన్నవాళ్ళతో మన ఇంట్లోనే ఉన్నట్లు మాట్లాడుతున్నాం. సోషల్ మీడియా వచ్చాక ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది.

ఐతే సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రెండ్స్ గురించి అందరికీ తెలిసిందే. ఛాలెంజిలు విసురుకుని ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసం వాటిని వాడుతుంటారు. అలా నవంబరులో ట్రెండ్ అవుతున్న ఒక ఛాలెంజి గురించి అందరూ తెలుసుకోవాలి. నో షేవ్ నవంబరు గురించి అందరూ వినే ఉంటారు. నవంబరులోకి అడుగుపెట్టగానే ఎన్నో రకాల మీమ్స్, గడ్డంతో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ లో దర్శనమిస్తుంటాయి.

అసలు నో షేవ్ నవంబర్ అంటే ఏమిటి? దానిని ప్రతీ సంవత్సరం ఎందుకు ఫాలో అవుతుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. నో షేవ్ నవంబరు అనేది క్యాన్సర్ అవగాహన కోసం చేపడుతున్న కార్యక్రమం. ఒక నెల మొత్తం గడ్డం తీసుకోకుండా ఉంటే ఆదా అయ్యిన డబ్బులని క్యాన్సర్ తో బాధపడుతున్నవారికి ఇవ్వడం, క్యాన్సర్ పై అవగాహన కల్పించే కార్యక్రమాలకి ఇవ్వడం చేస్తుంటారు.

దీనికోసం ఇంటర్నెట్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు నెల పూర్తయ్యాక ఆ డబ్బులని వారి అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా వెబ్ సైట్ కూడా ఉంటుంది. అందులోనే రిజిస్టర్ అవ్వొచ్చు. అంతే కాదు నో షేవ్ నవంబరు గురించి నలుగురికి అవగాహన కల్పించడానికి టీ షర్టులు, మాస్కులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆర్టర్ చేసుకుని వాడుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version