వైట్‌ రైస్‌, బ్రౌన్‌ రైస్‌కి తేడా ఏంటి..? వైట్‌రైస్‌ కంటే బ్రౌన్‌ రైస్‌ ఎందుకు మంచిదంటా?

-

చాలామంది అన్నం తినటానికే ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా మన తెలుగురాష్ర్టాల్లో అయితే..అందరూ అన్నమేతింటారు. నార్త్ లో అయితే..చపాతి, రొట్టెలతో అన్నం కూడా కొంచెం తింటారు. కానీ మనకు కడుపునిండా అన్నం తినకపోతే..ప్రశాంతంగా ఉండదు. ఆకలి తీరినట్లు అనిపించదు కూడా. నిజానికి అన్నం తినటం ఆరోగ్యానికి అంత మంచిదికాదు. రైస్ ఉండే క్యాలరీలు మనల్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్లో ఈ సమస్య మరీ ఎక్కువ. బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలా అని అన్నంమానేయటం మన వల్ల కాదు. అన్నం తినాలి కానీ బరువు పెరగకూడదనుకుంటే బ్రౌన్‌ రైస్‌ బెటర్. బ్రైన్ రైస్ గురించి మీరు కూడా వినేఉంటారు. ఈరోజు దానిగురించి ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

brown rice white rice

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ బెటరా?

బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే ఎక్కువ పోషకాలను అందిస్తుంది. సాధారణంగా ప్రజల ఇళ్లలో తెల్ల బియ్యం మాత్రమే ఉంటుంది. అయితే బ్రౌన్ రైస్‌లో ఎక్కువ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు బ్రైన్ రైస్ లోనే అధికంగా ఉంటాయి. 100 గ్రాముల వండిన బ్రౌన్ రైస్‌లో 1.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అదే 158 గ్రాముల వైట్ రైస్‌లో1 గ్రాము కన్నా తక్కువ ఫైబర్ ఉంటుంది. బ్రౌన్ రైస్‌లో మెగ్నీషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఈ రెండూ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. చక్కెర ఉన్నవారు గోధుమ గింజలను మాత్రమే తీసుకోవాలి. చెక్కెర ఉన్నావారిని వైద్యులు అన్నం తినటం తగ్గించమంటారు అందుకే. వీళ్లు బ్రైన్ రైస్ తినటం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.

బరువు తగ్గడంలో బ్రౌన్ రైస్ పాత్ర ఎంత?

బ్రౌన్ రైస్ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆస్తమా, ఆర్థరైటిస్‌తో సహా అనేక వ్యాధులపై పోరడతాయి. బ్రౌన్ రైస్ కొవ్వును త్వరగా కరిగిస్తుంది. శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో బ్రౌన్ రైస్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం తేలిందేంటంటే… తక్కువ కేలరీల ఆహారం తీసుకునే వ్యక్తులు శుద్ధి చేసిన ధాన్యాలు తినే వారి కంటే వేగంగా పొట్టను తగ్గించగలరు. మీరు చూడ్డానికి నీట్ గా తెల్లగా ఉండే రైస్ ను ఎంచుకోవడానికి ఇష్టపడతారు. కానీ గుర్తుంచుకోండి..రైస్ ఎంత వైట్ గా ఉంటే..అది మన ఆరోగ్యానికి అంత డేంజర్. పాలిష్ చేసీ చేసీ..రైస్ లో ఉన్న పోషకాలు అన్నీ పోతాయి. చివరకు ఘగర్ కంటెంట్ పెరుగుతుంది. ఒక రకంగా వైట్ రైస్ కంటే..రేషన్ బియ్యమే బెటర్ అని మీకు తెలుసా?

Read more RELATED
Recommended to you

Exit mobile version