టిఆర్ఎస్ ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో వరదల గురించి మాట్లాడే ఫామ్ హౌస్ ఫ్యామిలీ రాష్ట్ర రాజధానిలో వరదలపై ఏం సమాధానం చెబుతుంది? అని ప్రశ్నించారు. హైదరాబాదులో కొద్దిపాటి వర్షానికే వరదలను తలపించడానికి కారణం నాళాల అభివృద్ధికి కేటాయించిన నిధులు వినియోగించుకోకపోవడమేనని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు కిషన్ రెడ్డి.
“హైదరాబాద్ లో కొద్దిపాటి వర్షానికే వరదలను తలపించటానికి కారణం నాళాల అభివృద్ధికి కేటాయించిన నిధులు వినియోగించకపోవటం. స్ట్రాటెజిక్ నాళా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, హైదరాబాద్ ను ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకూ 209 కోట్ల బడ్జెట్ ను కేటాయించడం జరిగింది. కానీ ఈ కేటాయించిన బడ్జెట్ లో కేవలం 16 కోట్లు మాత్రమే అంటే 7.86 శాతం నిధులను మాత్రమే సద్వినియోగం చేశారు.
మిగిలిన 92.14 శాతం నిధులు నిరుపయోగంగా ఉండిపోయాయి. ఒక జర్నలిస్ట్ RTI ద్వారా అడిగిన ప్రశ్నకు స్వయంగా GHMC ఇచ్చిన సమాధానం ఇది. దేశంలో వరదల గురించి మాట్లాడే ఫార్మ్ హౌస్ ఫ్యామిలీ రాష్ట్ర రాజధానిలో వరదలపై ఏం సమాధానం చెబుతుంది?”. అని ప్రశ్నించారు.
హైదరాబాద్ లో కొద్దిపాటి వర్షానికే వరదలను తలపించటానికి కారణం నాళాల అభివృద్ధికి కేటాయించిన నిధులు వినియోగించకపోవటం. స్ట్రాటెజిక్ నాళా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, హైదరాబాద్ ను ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకూ ₹209 కోట్ల బడ్జెట్ కేటాయించగా కేవలం ₹16 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. pic.twitter.com/LPJZ3lME6h
— G Kishan Reddy (@kishanreddybjp) October 1, 2022