ఢిల్లీ ఓటర్లకు దేశంలోని ఇతర ప్రాంతాల ఓటర్లకు చాలా తేడా ఉంటుంది. ఎక్కువ మధ్య తరగతి ఉద్యోగ ఓటర్లతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చిన వారితో సహజంగానే చైతన్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే రెండు సార్లు గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి విజయం సాధించలేకపోయింది. అయితే తాజాగా మాజీ సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామని.. ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటామని తెలిపారు.
ఢిల్లీ ప్రజల తీర్పును శిరసా వహిస్తామన్నారు. పదేళ్లలో ఢిల్లీ ప్రజల కోసం ఎంతో చేశామని చెప్పారు. విద్య, వైద్య మౌళిక సదుపాయాల కోసం ఎంతో చేశామని చెప్పారు. విద్య, వైద్య మౌళిక సదుపాయాల కోసం ఎంతో కృషి చేసినట్టు వెల్లడించారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేయాలన్నారు. గెలిచన బీజేపీ నేతలకు ఈ సందర్భంగా కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తాము ఆప్ ను స్థాపించామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.