ఈఎంఐలు కట్టాల్సిందేనా…? బ్యాంకుల స్పందన ఏంటీ…?

-

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. దీనితో చాలా మందికి పూట గడవని పరిస్థితి ఏర్పడింది. చిన్న చిన్న ఉద్యోగులు కూడా ఉపాధి కోల్పోయి ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నారు. వాళ్ళను ఆదుకోవడానికి ఏ ఒక్కరు కూడా ముందుకి వచ్చే పరిస్థితి దాదాపుగా లేదు. దీనితోనే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. పేదలకు అన్నం పెట్టాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. వాళ్లకు ఆర్ధికంగా అండగా నిలవాలని నిర్ణయం తీసుకుంది.

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అయితే చిరు ఉద్యోగులకు అండగా నిలబడింది. బ్యాంకు వాయిదాలు కట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది. కట్టకపోయినా సరే వారికి సిబిల్ స్కోర్ పడిపోయే అవకాశం లేదని చెప్పింది. అయితే ఈ విషయంలో బ్యాంకులదే తుది నిర్ణయం కానుంది. ఫైనాన్స్ సంస్థలు కూడా వాయిదాలు తీసుకోవద్దని రిజర్వ్ బ్యాంకు సూచించింది. కాని చాలా బ్యాంకు లు మాత్రం ఈ విషయంలో స్పందించే పరిస్థితి కనపడటం లేదు.

ఖాతాదారులకు ఇప్పటి వరకు వాయిదాలు… రిజర్వ్ బ్యాంకు చెప్పినట్టు జూన్ నెల నుంచి కట్టాలని చెప్పిన మెసేజ్ ఏదీ కూడా రాలేదు. అయితే ఆదిత్య బిర్లా లాంటి ఫైనాన్స్ సంస్థలు మాత్రం వినియోగదారులకు మెసేజ్ లు చేసాయి. జూన్ నెల నుంచి వాయిదాలు చెల్లించాలి అని సూచించాయి. మరి బ్యాంకులు ఏ నిర్ణయం తీసుకుంటాయి అనేది మాత్రం స్పష్టత రావడం లేదు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version