తెలుగు సినీ ఇండస్ట్రీలో కామెడీ చిత్రాలకు పెట్టింది పేరు గా.. హాస్యాస్పద దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ.వీ.వీ.సత్యనారాయణ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఇక ఇంటిల్లిపాది నవ్వుకుంటూ చూడాలి అంటే కచ్చితంగా ఈ వీ వీ సినిమాలు చూడాల్సిందే అని అంటారు ఎవరైనా.. ఈయన సినిమాలు చూశారు అంటే ఎంత ఒత్తిడి అయినా సరే ఇట్టే పోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. చిరంజీవి, రాజేంద్రప్రసాద్ లాంటి స్టార్ హీరోలతో కూడా అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా చలామణి అయ్యారు.
ఈయన వారసులుగా ఇండస్ట్రీలోకి ఆయన పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్, చిన్న కొడుకు అల్లరి నరేష్ లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అల్లరి నరేష్ ఇప్పటికి కూడా తన నటన తో డిఫరెంట్ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా ముందుకు కొనసాగుతున్నాడు . కానీ ఆర్యన్ రాజేష్ గతంలో ఎన్నో సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నా ఆ తరువాత సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన బిజినెస్ రంగంలో మంచి లాభార్జన చేస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే తాజాగా ఆర్యన్ రాజేష్ వివాహం వెనుక ఉన్న రహస్యం ఏమిటి..? ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి సుభాషిని ఎవరు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎవరో కాదు ఈ వి వి సత్యనారాయణ స్నేహితుడి కుమార్తె. మొదట్లో ఫోటో చూసి సుభాషిణి నీ వివాహం చేసుకోవడానికి ఆర్యన్ రాజేష్ నిరాకరించాడు. కానీ తండ్రి కోరిక మేరకు ఆమెను లైవ్ లో చూసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. అలా 2011 జనవరి 5వ తేదీన పెళ్లి చూపులు జరగగా.. జరిగిన వారానికి అంటే జనవరి 11వ తేదీన ఈవీవీ సత్యనారాయణ స్వర్గస్తులయ్యారు. ఆ సమయంలోనే సుభాషిని ఆర్యన్ కు ఎంతగానో సపోర్ట్ గా నిలిచిందని ఇక 2012 ఫిబ్రవరి 12వ తేదీన ఆమెను వివాహం చేసుకున్నారు. సంవత్సరం తర్వాత వీరికి ఒక కుమారుడు జన్మించగా .. మళ్లీ వారి తండ్రే పుట్టాడు అని భావించడం గమనార్హం.