బాల‌య్య సినిమాకు అదిరిపోయే టైటిల్ ? ఏంటో తెలుసా !

-

అఖిలాంధ్ర కోటి ఆంధ్రుల‌కు ఒక్క‌డే అన్న‌గారు.. ఆయ‌న పేరు చిర స్మ‌ర‌ణీయం.. ఆ రూపం అపురూపం. ఆయ‌న మ‌న‌కు రాముడు.. కృష్ణ‌డు.. అవ‌తార మూర్తి.. అంత‌గా పౌరాణిక పాత్ర‌ల‌లో.. ఇతిహాస ప్ర‌ధాన క‌థ‌ల‌లో ఒదిగిపోయిన అన్న గారు మ‌ళ్లీ వ‌స్తున్నారు. అవును ! ఎలానో మీరే చ‌ద‌వండి.. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో…

సినిమాలలో బాల‌య్య., అభిమానుల్లో బాల‌య్య, అన్న గారి అభిమానిగా బాల‌య్య ఎన్నో వేరియేష‌న్స్ ఆయ‌న రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్ కి.. ఆ విధంగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. ఆ విధంగా ఆయ‌న తండ్రి నంద‌మూరి తార‌క రామారావు సాధించిన విశ్వ విఖ్యాత ఖ్యాతిని స్థిరం చేయాల‌న్న త‌ప‌న‌లో ఉన్నారు. భారీ విజ‌యాలు న‌మోదు చేసినా, చ‌రిత్ర తిర‌గ‌రాసి మీసం మెలేసినా ఆయ‌న స్టైల్ వేరు. ఫ‌క్తు మాస్ హీరో అని డెఫినిష‌న్ రాయాలి అంటే అందుకు బాల‌య్య వంద‌కు వంద‌శాతం అర్హులు. హీ ఈజ్ వెరీ క్యాప‌బుల్ ఫ‌ర్ ద‌ట్ .. అండ్ ఆల్సో యాబ్ట్ ఫ‌ర్ ద‌ట్.

సినిమా సినిమాకూ ప‌రిణితి సాధించ‌డం క‌ష్టం. సినిమా సినిమాకూ విజ‌యాల స్థాయిని పెంచ‌డం ఇంకా క‌ష్టం అయినా బాల‌య్య రేంజ్ వేరు. ఆయ‌న సాధించాల‌నుకున్న‌వి ఎన్నో సాధించి, నాన్న ఎన్టీఆర్ ను స్థాయిని చేరుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఆయ‌న పేరు, ప్ర‌తిష్ట‌లు నిలిపే ప‌నులే ఎప్పుడూ చేస్తాన‌ని అంటారు బాల‌య్య. ఇండ‌స్ట్రీలో ఆయ‌న‌కు తిరుగులేదు.

ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ అని అంటారంతా ! త‌ప్పండి ఓ మంచి సినిమా చేస్తే ఆద‌రిస్తారు. నా నుంచి కూడా డిజాస్ట‌ర్లు వ‌చ్చాయి కదా! వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి అని సున్నితంగా చెబుతారు. అభిమానుల కోస‌మే సినిమాలు చేస్తాను అని ఎప్పుడూ అంటారు. క్యారెక్ట‌ర్ డిమాండ్ చేస్తే ఎన్నో రిస్కులు నేను భ‌రిస్తాను. డైరెక్ట‌ర్ గారూ ! మీరు చెప్పండి నేను చేస్తాను అని వినమ్ర పూర్వ‌కంగా చెబుతారు.

అఖండ సినిమా విజ‌యం త‌రువాత ఆయ‌న ఇంకా జోష్ పెంచారు. మ‌ళ్లీ ఓ మంచి సినిమా ఇవ్వాల‌న్న త‌ప‌న‌తో ఆయ‌న ప‌నిచేస్తున్నారు. ఆయ‌న‌ను అభిమానించే గోపీచంద్ మ‌లినేని (క్రాక్ ఫేం) ఓ య‌థార్థ క‌థ ఆధారంగా సినిమా తీస్తున్నారు.
ఇప్పుడీ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. అన్న‌గారు పేరిట ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ నిర్ణ‌యించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version