ఉద్యాన పంటల్లో మన దేశంలో నంబర్ వన్ ప్లేస్ లో ఉంది అరటి సాగు. విస్తీర్ణంలో మాత్రం మామిడి, నిమ్మ జాతుల తర్వాత ముడో స్థానంలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అరటి తోటల పెంపకం విస్తారంగా సాగుతోంది. అయితే అరటి పంట వేసినప్పుడు దానిలో అంతర పంటలు కూడా వేస్తారు. అయితే అరటిలో వేయాల్సిన అంతర పంటల గురించి తెలుసుకుందాం..?
అరటి తోట ఎదుగుదల తొలిదశలో అంతర పంటలను సులభంగా పెంచవచ్చు. కూరగాయలు, ముల్లంగి, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బచ్చలికూర, మిరపకాయ, బెండకాయ, పొట్లకాయ, బంతి పువ్వు వంటి పంటలను విజయవంతంగా అంతర పంటలుగా వేసుకోవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. దక్షిణ భారత దేశంలో వక్క, కొబ్బరి ఎక్కువగా వేస్తున్న అంతర పంటలు.
అరటి తన పంట కాలంలో అనేక పిలకలను ఉత్పత్తి చేస్తుంది.ఇవి ఎక్కువగా ఉంటె రసం పీల్చే పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ పిలకలను తొలగించడం మంచిది. ఈ పక్రియను డి సకరింగ్ అంటారు.5-6 వారాల వ్యవధిలో ఈ సక్కర్‌లను తొలగించడం ద్వారా మొక్కల పెరుగుదలను వేగవంతం చేయవచ్చు. ప్రాపింగ్ ఈ పద్దతిని గాలి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిర్వహిస్తారు. వీచే గాలులకు అరటి గెలలు రాలకుండా వెదురు బొంగులతో ఆసరా ఇస్తారు.