జ‌న‌తా క‌ర్ఫ్యూ ట్రైల‌ర్ మాత్ర‌మేనా..? మోదీ ఏం చేయ‌బోతున్నారు..?

-

దేశంలో క‌రోనా కేసులు గ‌త నాలుగైదు రోజులుగా విప‌రీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం దేశంలో 258 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. ఆ సంఖ్య రాను రాను ఇంకా పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని మోదీ ఈ నెల 22న.. ఆదివారం.. ఉద‌యం 7 నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు జ‌న‌తా క‌ర్ఫ్యూ పాటించాల‌ని పిలుపునిచ్చారు. ఆ రోజున అన్నీ బంద్ ఉంటాయని, జ‌నాలెవ‌రూ బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని, క‌రోనా రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంతోపాటు.. క‌రోనా బాధితులు, అనుమానితుల‌కు సేవ‌లు చేస్తున్న డాక్ట‌ర్లు, వైద్య సిబ్బందికి కృతజ్ఞ‌త‌లు తెలుపుతూ అంద‌రూ ఇండ్ల‌లోనే ఉండాల‌ని.. పిలుపునిచ్చారు. అయితే.. ప్ర‌ధాని మోదీ జ‌న‌తా క‌ర్ఫ్యూకు పిలుపునివ్వ‌డం వెనుక అస‌లు కార‌ణ‌మేమిటి..? ముందు ముందు క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌క‌పోతే ఆయ‌న ఏం నిర్ణ‌యం తీసుకుంటారు..? అంటే…

ప్ర‌ధాని మోదీ జ‌న‌తా క‌ర్ఫ్యూ పాటించ‌మ‌ని పిలుపునివ్వ‌డం వెనుక చాలా మంది చ‌ర్చించుకుంటున్న కార‌ణం ఒక్క‌టే.. జ‌న‌తా క‌ర్ఫ్యూ వ‌ల్ల జ‌నాలు ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు రాక‌పోతే 14 గంటల త‌రువాత వాతావ‌ర‌ణంలో ఉండే వైర‌స్ చ‌నిపోతుంద‌ని, దీని వ‌ల్ల ఇత‌రుల‌కు ఈ వైర‌స్ అంటుకోకుండా ఉంటుంద‌నే ఓ మెసేజ్ వైర‌ల్ అవుతోంది. అయితే అది నిజమే అయిన‌ప్ప‌టికీ.. మోదీ జ‌న‌తా క‌ర్ఫ్యూ పాటించాల‌ని చెప్ప‌డం వెనుక మ‌రొక కార‌ణం ఉంద‌ని తెలుస్తోంది. అదేమిటంటే.. సాధార‌ణంగా దేశ ప్ర‌జ‌ల‌కు ఏదైనా క‌రోనా లాంటి విప‌త్తు సంభ‌వించిన‌ప్పుడు జ‌నాల‌ను స‌హ‌జంగానే ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా క‌ర్ఫ్యూ విధిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు ఎక్క‌డైనా అల్ల‌ర్లు జ‌రిగితే క‌ర్ఫ్యూ విధించి కొన్ని గంట‌లు లేదా రోజుల త‌రువాత అంతా స‌ద్దుమ‌ణిగాక కర్ఫ్యూ ఎత్తేస్తారు క‌దా.. అయితే ప్ర‌స్తుతం క‌రోనా అలా కాదు.. దాని ప్ర‌భావం ఎప్ప‌టి వ‌ర‌కు త‌గ్గుతుందో తెలియ‌దు. అలా అని చెప్పి దేశం మొత్తాన్ని బంద్ చేసి సుదీర్ఘ కాలం క‌ర్ఫ్యూ విధించ‌డం కూడా కుద‌ర‌దు. స‌డెన్‌గా అలా చేస్తే జ‌నాలు భ‌య‌భ్రాంతుల‌కు లోన‌వుతారు. అయితే అలా కాకుండా ఉండాలంటే.. అలాంటి ప‌రిస్థితుల‌కు ముందుగానే జ‌నాల‌ను అల‌వాటు చేయాలి. దాంతో వారు అలాంటి ప‌రిస్థితుల‌కు మాన‌సికంగా సిద్ద‌మ‌వుతారు. ఈ క్ర‌మంలో ఎలాంటి అక‌స్మాత్తు నిర్ణ‌యాలు తీసుకున్నా జ‌నాలు పెద్ద‌గా భ‌య ప‌డ‌కుండా ఉంటారు. దీంతో దేశం మొత్తాన్ని లాక్ డౌన్ చేసి క‌రోనాను కంట్రోల్ లోకి తెచ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ప్రస్తుతం మోదీ ఆలోచిస్తున్న‌ది కూడా ఇదేనా.. అంటే.. అందుకు.. అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

క‌రోనా వైర‌స్ పట్ల ప్ర‌జ‌ల‌ను మ‌రింత అప్ర‌మ‌త్తం చేసేందుకు, వైర‌స్‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్మూలించేందుకు ముందు ముందు మ‌రిన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల్సి రావ‌చ్చు. అలాంటి సంద‌ర్భాల్లో అక‌స్మాత్తుగా ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసే నిర్ణ‌యాలు తీసుకుంటే దేశంలో ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. దాన్ని నివారించేందుకు ప్ర‌జ‌ల‌ను అన్ని ర‌కాల ప‌రిస్థితుల‌కు ముందుగానే స‌న్న‌ద్ధం చేసేందుకే మోదీ ఇలా ఒక రోజు జ‌న‌తా క‌ర్ఫ్యూకు పిలుపునిచ్చార‌ని తెలుస్తోంది. ఈ క‌ర్ఫ్యూ రోజు ఉండే ప‌రిస్థితుల‌ను ఒక్క‌సారి అంచ‌నా వేశాక‌.. మ‌ళ్లీ మోదీ ఇంకో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తోంది. అయితే అదే జ‌రిగితే దేశం మొత్తం స్తంభించిన‌ట్లు అవుతుంది. దీంతో క‌రోనా వైర‌స్‌ను 100 శాతం ఎదుర్కొన‌వ‌చ్చు. మ‌రి మోదీ.. జ‌న‌తా క‌ర్ఫ్యూను ఒక్క రోజుకే ప‌రిమితం చేస్తారా..? ముందు ముందు దాన్ని మ‌రిన్ని రోజుల పాటు కొన‌సాగిస్తారా..? అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version