భట్టి దీక్షకు వారు హ్యాండిచ్చారా..టీ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది

-

తెలంగాణ కాంగ్రెస్ రైతుల సమస్యలపై కొంత ఫోకస్ పెట్టింది. కేంద్రం తెచ్చిన చట్టాలను వ్యతిరేకించడం కి తోడుగా.. కొనుగోలు కేంద్రాల ఎత్తివేతను కూడా ప్రధాన అజెండాగా చేర్చాలని డిసైడ్ అయ్యారు. అందరూ కలిసి కలిసికట్టుగా ఆందోళన చేయాలని అనుకున్నారు. అందరు నేతలు ఐక్యంగా కదిలినా ఓ ముగ్గురు ప్రజాప్రతినిధులు మాత్రం హ్యాండిచ్చారు.దీని పైనే టీ కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది…


తెలంగాణలో రైతులను అండగా నిలిచి వారి సమస్యల పై ఫోకస్ పెట్టాలని డిసైడైంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. దింట్లో భాగంగా పీసీసీ ఆందోళన బాట పట్టింది. అటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ధర్నా చౌక్ లో ఒక్క రోజు దీక్ష చేశారు. పార్టీ ఎంపీలు..ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీ లు బృందంగా దీక్ష చేయాలని చూశారు. పార్టీలో అందరూ దీక్షకు హాజరయ్యారు. కానీ సీఎల్పీ బృందంలోని ఎమ్మెల్యే సీతక్క, రాజగోపాల్ రెడ్డి తో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజరు అయ్యారు.

భట్టి చేసిన దీక్షలో సీతక్క …కోమటిరెడ్డి బ్రదర్స్ హాజరు కాకపోవడం పై చర్చ జరుగుతోంది. సీఎల్పీ నేత భట్టి… తనను పట్టించుకోవడం లేదని సీతక్క బాహాటంగానే విమర్శలు చేశారు. ఈ వ్యవహారం అంతా..పీసీసీ నియామకం నుండే మొదలైంది. సాదరణంగా అసెంబ్లీ సమావేశాల్లో అందరూ కలిసే ఉండే వారు. పీసీసీ నియామకం లో సీతక్క రేవంత్ మనిషి అనే ముద్ర ఉంది. రేవంత్ మనిషిని అయితే..కనీసం నా అభిప్రాయం అయినా తెలుసుకోవాలి..నచ్చకపోతే దూరం పెట్టినా బాగుండేది అనేది సీతక్క వర్షన్. దీక్షకు రాకపోవడం కూడా అందుకేనా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే దీక్షకు రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు..రేవంత్ మద్దతిచ్చే సీతక్క హాజరైతే ఇబ్బందేంటి అనే వాదన కూడా ఉంది.

కోమటిరెడ్డి బ్రదర్స్ అంశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎల్పీ నేత భట్టి మధ్య మంచి సంబందాలే ఉన్నాయి. ఇక రాజగోపాల్ రెడ్డి వ్యవహారమే కొంత సీఎల్పీ లో కన్ఫ్యూజన్ లో ఉంది. గడిచిన కొన్ని రోజులుగా సీఎల్పీ కి రావడం…అసెంబ్లీ సమావేశాల్లో కలిసి పనిచేయడం సాధారణంగా జరుగుతూ వచ్చింది. కానీ ఈ మధ్య మళ్ళీ పాత పల్లవినే ఎత్తుకున్నారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ లో బీజేపీ బలపడుతుంది..నేను కూడా వెళ్తా అని ప్రకటన చేశారు. దీంతో మళ్ళీ కొంత గ్యాప్ వచ్చింది. అయినా కాంగ్రెస్ చేస్తున్న దీక్ష కూడా బీజేపీ తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగానే… బీజేపీలోకి వెళ్లాలని అనుకునే రాజగోపాల్ రెడ్డి..ఆ ప్రభుత్వం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడితే కండువా మార్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది అనుకున్నారో ఏమో కాని.. దీక్ష కు డుమ్మా కొట్టారు.

ఇక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎందుకు హాజరు కాలేకపోయారన్నది కూడా చర్చ నీయాంశంగా మారింది. పీసీసీ విషయంలో వెంకట్ రెడ్డి కూడా అసంతృప్తి తో ఉన్నారా..అనే టాక్ కూడా ఉంది. ఉన్నదే ఆరుగురు..అందులో ఇద్దరు డుమ్మా కారణం ఏదైనా సమస్య తీవ్రత దృష్ట్యా కలిసి నడవాల్సిన అంశమే. దీనిపైనే తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version