స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ను ఉపయోగించడం సౌకర్యవంతంగా ఉండడంతో ఈజీగా వాట్సాప్ నుండి ఫోటోలు మీ వీడియోలు మొదలైన వాటిని పంచుకుంటూ ఉంటారు. తాజాగా సరికొత్త ఫీచర్లతో యూజర్ల ముందుకి వస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం కంపెనీ యూపీఐ ద్వారా చెల్లింపులను సులభవతరం చేయడానికి కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మంది యూపీఐ చెల్లింపుల కోసం ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ని వాడుతున్నారు.
కానీ వాటితో ఎలాంటి పని లేకుండా చాలా సులభం గా డిజిటల్ పేమెంట్స్ చేసుకోవడానికి వాట్సాప్ సరికొత్త ఫీచర్ ని అందుబాటులో తెచ్చింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఎలాంటి ప్రదేశాలకి వెళ్లకుండా క్యూర్ కోడ్ ద్వారా ఈజీగా చెల్లింపులు చేసుకోవచ్చు కెమెరా సెర్చ్ ఐకాన్ తో పాటు ప్రధాన చాట్ ఇంటర్ఫేస్లో క్యూఆర్ కోడ్ స్కానర్ ఎంపిక అందుబాటులో ఉంటుంది యూపీఐ అకౌంట్ లోకి వెళ్లకుండా ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు ఫోన్ పే గూగుల్ పే వాటికి ఇది పెద్ద సమస్యగా ఉండొచ్చు అని తెలుస్తోంది.