వైఎస్ పేరు చెప్పగానే మొదట గుర్తు వచ్చేది మొహం నిండా చిరునువ్వు : వైఎస్ షర్మిల

-

వైఎస్ పేరు చెప్పగానే మొదట గుర్తు వచ్చేది మొహం నిండా చిరునువ్వు, ఆయన నడిస్తే రాజసం కొట్టొచ్చినట్టు కనపడేదని వైఎస్ షర్మిల అభిప్రాయ పడ్డారు.అమరావతిలో జరిగిన వైయస్ జయంతి సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ… వైఎస్ఆర్ ఏం చేయాలన్నా దైర్యంగా చేసేవారని గుర్తుచేశారు. నాన్న చనిపోవడానికి కొద్ది రోజుల ముందు గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయి. చివరిసారి నాన్నను కలిసిన సమయంలో చాలా విషయాలు మాట్లాడాను అని తెలిపారు.

‘కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతో నాన్న పని చేశారు. కాంగ్రెస్ పార్టీతో దేశాభివృద్ది సాధ్యం అని ప్రగాఢంగా విశ్వసించేవారు అని వైఎస్ షర్మిల అన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తుందని అనేవారు. బీజేపీకి బద్ద వ్యతిరేకిగా ఉండేవారు. కానీ ఇప్పుడు వైఎస్ ఆశయాలు నిలబెట్టుకుంటానని చెప్పేవారు బీజేపీతో తెరవెనుక పొత్తులు పెట్టుకున్నారు. అలాంటి వారు వైఎస్ ఆశయాలను ఎలా ముందుకు తీసుకెళతారు అని తన సోదరుడు జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని నాన్న బలంగా కోరుకునేవారు. నాన్న సంకల్పం కోసం పని చేస్తాను అని’ వైఎస్ షర్మిల తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version