డీలిమిటేషన్‌తో ఎంపీ సీట్లు తగ్గుతాయని కేంద్రం ఎక్కడ చెప్పింది : ఎంపీ ఈటల

-

లోక్‌‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.డీలిమిటేషన్‌పై ప్రాంతీయ పార్టీల వలే కాంగ్రెస్ దిగజారి మాట్లాడుతోందని ఈటల మండిపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.డీలిమిటేషన్‌పై కేంద్రం ఎక్కడ అధికారిక ప్రకటన చేయలేదని, అందుకు ఎలాంటి విధివిధానాలను కూడా ఖరారు చేయలేదన్నారు.అఖిలపక్ష భేటీతో విపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు.

డీలిమిటేషన్‌తో తెలంగాణలో ఎంపీ సీట్లు తగ్గుతాయని జరగుతోన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు.సీట్లు పెరిగే అవకాశం ఉండొచ్చు కానీ, తగ్గే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. ఎవరూ అలాంటి అపోహాలు పెట్టుకోవద్దని విపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనకు ప్రాతిపాదిక ఏంటనే విషయం ఇంకా తేలాల్సి ఉందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news