తాను చనిపోతూ ముగ్గురికి ప్రాణదానం చేసిన రైతు.. ఎక్కడంటే?

-

బ్రెయిన్ డెడ్ అయిన ఓ రైతు.. తాను చనిపోతూ మరో ముగ్గురి ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఇంటి పెద్ద మరణించడంతో కుటుంబ సభ్యులు పుట్టెడు దుఖంలో మునిగిపోయారు.

ఈ క్రమంలోనే వారి కుటుంబసభ్యులు తీసుకున్న నిర్ణయం ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలిచింది. కర్నూలు జిల్లాకు చెందిన పెద్దయ్య (59) వ్యవసాయం చేస్తుంటాడు. ఈ నెల 2న ఇంట్లో బ్రష్ చేస్తున్న టైంలో అతనికి తీవ్రమైన తలనొప్పి వచ్చింది. మెదడులో ఏదో పగిలినట్టు శబ్దం వినిపించింది. ఇదే విషయాన్ని వారి కుటుంబసభ్యలకు చెప్పాడు.

దీంతో వారు కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్‌కు తరలించగా.. తలలో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు గుర్తించారు.చికిత్స జరుగుతున్న క్రమంలో శనివారం ఆ వ్యక్తి బ్రెయిన్ డెడ్ అవ్వగా.. వైద్యుల సూచన మేరకు మృతుడి భార్య, కుమారుల అంగీకారంతో లివర్, రెండు కిడ్నీలను దానం చేశారు. పెద్దయ్య చనిపోతూ మరో ముగ్గురికి ప్రాణదానం చేయడం తమకు గర్వంగా ఉందని మృతుడి భార్య,కుమారులు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news