శివుడికి అభిషేకం చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. ఎక్కడంటే?

-

ప్రస్తుత రోజుల్లో తెల్లారితే ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. తరువాతి క్షణంలో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. మారుతున్న ఫుడ్ టైమింగ్స్, స్లీపింగ్ టైమింగ్స్, ఒత్తిడితో కూడిన జీవనం, కాలుష్యం, కలుషిత ఆహారం వీటన్నింటి వలన మనిషి ఆయుర్దాయం క్రమంగా తగ్గుతోంది. మెడికల్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నా.. దీర్ఘకాలిక వ్యాధులు వెంటాడుతున్నాయి.

ఫలితంగా నడుస్తూ, డ్యాన్స్ చేస్తూ, కుర్చీలో కూర్చుని సైతం కొందరు కుప్పకూలి చనిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. అందులో వయస్సుతో సంబంధం లేకుండా అన్ని ఏజ్‌ల వారుతున్నారు. ముఖ్యంగా యువత అనుకోకుండా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి శివాలయంలో శివుడుకి అభిషేకం చేస్తూ కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న వ్యక్తి వెంటనే స్పందించి సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. గుండెపోటుతో ఆ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగుచూడగా.. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version