ఎక్క‌డ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ ఎత్తివేత

-

తెలంగాణ రాష్ట్రం లో స్థానికి సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. నిన్న‌టి తో నామినేష‌న్ల ఉప సంహ‌ర‌ణ ప్ర‌క్రియా కూడా ముగిసింది. ఈ ప్ర‌క్రియా లో నిజామాబాద్ తో పాటు వ‌రంగ‌ల్‌, రంగారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో నామినేష‌న్లు వేసిన వారి లో చాలా మంది ఉప సంహ‌రించు కున్నారు. దీంతో అధికార పార్టీ కి చెందిన వారే పోటీ లో ఉన్నారు. దీంతో వారు ఆయా జిల్లా లో ఎక‌గ్రీవం గా ఎమ్మెల్సీ గా ఎన్నిక అయ్యారు.

దీంతో నిజామాబాద్, వ‌రంగ‌ల్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ తో పాటు రంగారెడ్డి జిల్లా లో ఎమ్మెల్సీ కోడ్ ను ఎత్తి వేస్తున్న‌ట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం క‌మిష‌న‌ర్ శ‌శాంక్ గోయ‌ల్ ప్ర‌క‌టించాడు. ఇది ఇలా ఉండ‌గా నిజమాబాద్ నుంచి కల్వ‌కుట్ల క‌విత ఎమ్మెల్సీ గా ఏక‌గ్రీవంగా ఎన్నిక అయ్యారు. అలాగే వ‌రంగ‌ల్ నుంచి కూడా టీఆర్ఎస్ అభ్య‌ర్థి పోచం ప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక అయ్యారు.

 

మ‌రో వైపు మ‌హ‌మూబ్ న‌గ‌ర్ జిల్లాలో రెండు స్థానాల ఉన్నాయి. ఈ రెండు స్థానాల‌ను కూడా అధికార పార్టీ అభ్య‌ర్థు లే కైవ‌సం చేసుకున్నారు. ఒక స్థానం లో క‌సిరెడ్డి నారాయ‌ణ రెడ్డి మ‌రొక స్థారం లో కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి ఎన్నిక అయ్యారు. దీంతో పాటు రంగ‌రెడ్డి జిల్లా లో కూడా రెండు స్థానాలు ఉన్నాయి. ఇక్క‌డ కూడా అధికార పార్టీ అభ్య‌ర్థుల ఏక‌గ్రీవం అయ్యారు. ఒక స్థానం లో ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి మ‌రొక స్థానం లో శంభీపూర్ రాజు ఏక‌గ్రీవం గా ఎన్నిక అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version