Vasthu Tips : ఇంట్లో అద్దం ఏ వైపు ఉండాలో తెలుసా..?

-

వాస్తుని నమ్మేవారు ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలనే విషయంలోనూ వాస్తునే పాటిస్తారు. వాస్తు ప్రకారం ఇంటిని అలంకరించుకపోతే ఇంట్లో ఏదైనా అనర్థం జరుగుతుందని భావిస్తారు. అయితే ఇంట్లో ఏ సైజు అద్దం ఉండాలి..? ఆ అద్దాన్ని ఏ వైపు పెట్టుకోవాలనే విషయంపై వాస్తు పండితులు ఏం చెబుతున్నారంటే..?

వాస్తు శాస్త్రంలో ఇంటి నిర్మాణం నుంచి అలంకరణ, ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలనే దానికీ ప్రాముఖ్యత ఉంది. వాస్తు నమ్మేవారు ఇంట్లో అణువణువు వాస్తు ప్రకారమే ఉండాలని కోరుకుంటారు. కాస్త అటూ ఇటూ అయినా.. ఏదో అరిష్టం జరుగుతుందని భయపడుతుంటారు. అయితే వాస్తుని నమ్మేవారు.. ఇంట్లో వస్తువులను వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోకపోతే అనవసరపు గొడవలు, చికాకులు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారని వాస్తు పండితులు చెబుతున్నారు.

సాధారణం అందరూ తమ ఇళ్లలో పెద్దపెద్ద అద్దాలు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అందం కోసం అద్దాలను ఇంట్లో వివిధ ప్రదేశాల్లో .. నచ్చిన సైజుల్లో  ఏర్పాటు చేసుకుంటారు. అయితే అద్దం పెట్టడానికి కూడా నిర్దిష్టమైన స్థలం, సైజ్ ఉండాల్సిందేనని వాస్తు పండితులు అంటున్నారు.

మీ ఇంటిలో నైరుతి దిశలో బాత్రూమ్ లేదా టాయిలెట్ ఉంటే.. అప్పుడు అద్దాన్ని తూర్పు దిశలోని గోడకు చదరపు ఆకారంలోని అద్దాన్ని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి.

ఇంటి నిర్మాణంలో ఏదైనా భాగం అసాధారణ ఆకారంలో లేదా చీకటిగా  ఉన్నట్లు అయితే.. అటువంటి ప్రాంతంలో అద్దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా అద్దం ఉంచడం ద్వారా శక్తిని సమతుల్యం చేసుకోవచ్చు.

అంతేకాదు.. మీ ఇంటి వెలుపల..  విద్యుత్ స్తంభాలు, ఎత్తైన భవనాలు,  భారీ చెట్లు లేదా పదునైన చెట్ల భాగాలు ఉన్నట్లు అయితే.. అటువంటి ఇంటి ప్రధాన ద్వారం వద్ద అద్దం ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసే అద్దాన్ని అష్టభుజిలా ఉండి..  చెక్క ఫ్రేమ్‌లో ఉండేలా చూసుకోవాలి.  ఇలా ఏర్పాటు చేసుకునే అద్దానికి ఫ్రేమ్ ..  ఎరుపు, ఆకుపచ్చ, పసుపు , బంగారం రంగులో ఉండెలా చూసుకోవాలి. ఇది కేవలం వాస్తుని నమ్మేవారి కోసమేనని వాస్తు పండితులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version