ఆ ఊర్లో ఎవరికి పేరు ఉండదట.. పిలవాలంటే ఈల వేయాల్సిందే..!

-

అది మనదే కాని..దాన్ని మనకంటే పక్కనే వాళ్లే ఎక్కువ వాడతారు.. ఏంటా అనుకుంటున్నారా.. మన పేరండి. మనకు ఉన్న పేరు పేరు కాకుండా ఇంకా ముద్దుపేర్లు అని కూడా ఉంటాయి. అసలు పేరపెట్టడమే మనకు ఒక పండుగ. జాతాకాలు చూపించి ఏ అక్షరం మీద పెట్టాలో పంతులుగారితో చూపించి వెతికి వెతికి ఆఖరికి ఓ పేరుపెడతాం. కానీ అక్కడివారికి పేరే ఉండదట. అసలు పేరు లేకుండా ఎలా, ఒక వ్యక్తిని పిలవాలంటే ఏం చేస్తారు వాళ్లు అని డౌట్ వస్తుందా. ఈల ద్వారానే పిలుచుకుంటారు. ఈలేనే పేరుగా మార్చుకున్న వీరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మేఘాలయలో ఈస్ట్‌ ఖాసి జిల్లా కాంగ్‌థాన్‌ అనే ఊళ్లోని ప్రజలు ఇలా విజిల్స్ తోనే తమ వాళ్ళని పిలుచుకుంటారు. ఒకరికొకరు ఎదురుబడితే విజిల్స్ తోనే పలకరించుకుంటారు.. 700 కి పైగా జనాభా ఉంటున్న ఈ ప్రాంతంలో పక్షుల సౌండ్స్, ప్రకృతిలో వచ్చే సౌండ్స్, సినిమా పాటల్లోని మ్యూజిక్.. ఇలా రకరకాల సౌండ్ లను గుర్తుపెట్టుకుని వాటితోనే కొత్త సౌండ్ ని క్రియేట్ చేసుకుని వారి పిల్లలకు పేరు పెట్టుకుంటారట.. చిన్న పిల్లలకు కూడా చిన్నతనం నుంచే సౌండ్స్ ని చేయడం, గుర్తుపెట్టుకోవడం, ఈల వేయడం వంటి వాటిని నేర్పిస్తారట. భలే వింతగా ఉంది కదూ.

సాధారణంగా ఎవరైనా మనల్ని ఈల వేసి పిలిస్తే..అది మనకు అసభ్యంగా అనిపిస్తుంది. ర్యాగింగ్ చేస్తున్నారనేస్తాం. కానీ వీళ్లు ఈలలు వేస్తే తమ పిల్లవాడు ఎదిగాడని భావిస్తారట. తమ పిల్లాడికి ఈల వేయడం వచ్చిందంటే ఆ తల్లితండ్రులు తమ బిడ్డను ఎత్తుకుని మురిసిపోతారట. ఓ పక్క ప్రపంచం ఎంత అప్ డేట్ అవుతున్నా.. వారు మాత్రం వారి సంప్రదాయానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.

పిల్లలకు కూడా చిన్నతనం నుంచే.. మనం పదాలను నేర్పించినట్లు వారు సౌండ్స్ ని నేర్పిస్తారట. రకరాల సౌండ్స్ చేయడం, ఈలలు వేయడం వంటివి వారికి చిన్నతనం నుంచే అలవాటు అయ్యి ఉంటాయి. కొత్తగా పుట్టిన వారికి 30 సెకండ్స్ నిడివితో సౌండ్ ని సృష్టించి పేరు పెడతారట. ఇక్కడ మనం ఏ పేరు పెట్టుకున్నా ఇంట్లో వాళ్ళు షార్ట్ కట్ లో పిలుస్తూ ఉంటారు కదా.. అక్కడ కూడా అంతే.. 30 సెకండ్స్ సౌండ్ లో ఉండే ఈలను ఆరు సెకండ్ల సౌండ్ ని ఉపయోగనుంచి ఇంట్లో షార్ట్ కట్ లో పిలుచుకుంటుంటారట.

ఇలా ఈలలతో పీల్చుకోవడాన్ని ‘జిగవా యోబి’ అని పిలుస్తారట. వారి భాషలో ఈ పదానికి అర్ధం ఏంటి అంటే.. “అమ్మ ప్రేమ” అని. మన పెద్దలు మనకు జోల పాడినట్లు.. వీరు రకరకాల ట్యూన్స్ తో వారి పిల్లలకు జోల పాడతారట. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం ఇప్పటికీ అక్కడ కొనసాగిస్తున్నారంటే చాలా పెద్దవిషయమే అని చెప్పాలి. ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు కూడా తక్కువే. ఇప్పటివరకు 6 గురు మాత్రమే చదువుల కోసం ఆ ఊరు దాటి బయటకు వచ్చారట. మిగిలిన వారంతా సాంప్రదాయ పనులపైనే ఆధారపడి జీవిస్తున్నారట.

– Triveni Buskarowthu 

Read more RELATED
Recommended to you

Exit mobile version