నవరాత్రులు మొదటి రోజు తెలుపు వస్త్రాలను ధరించాలి..ఎందుకంటే?

-

దసరా పండుగ గురించి అందరికి తెలుసు..తొమ్మిది రోజులు నవరాత్రులను జరిపి చివరి రోజు దసరా పండుగను చేస్తారు..దుర్గమ్మని తొమ్మిది రూపాల్లో అలంకరణ చేసి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు..ప్రతి ఏడాది ఇలానే చేస్తారు.. ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 26 నుండి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. హిందూ మత సాంప్రదాయాల ప్రకారం నవరాత్రులకు ఎంతో విశేషం ఉంది. తొమ్మిది రాత్రుల పాటు జరిగే నవరాత్రుల్లో దుర్గమ్మను ఒక్కో రోజు ఒక్కో అవతారంలో పూజిస్తారు..

అంతేకాదు ఒక్కో అవతారానికి వివిధ రకాల ప్రసాదాలను కూడా నైవెద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు.. అలాగే ఈ తొమ్మిది రోజులకు ఒక్కో రోజు ఒక రంగును కేటాయిస్తారు. ఆ రోజు అమ్మవారికి ఆ రంగులోని చీరతో అలంకరిస్తారు. ఆయా రోజుల్లో ఆ వర్ణాల్లోని దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. పంచాంగం ప్రకారం.. సెప్టెంబర్ 26వ తేదీన నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.

ఈ రోజు నుండే నవరాత్రి పూజలు మొదలవుతాయి. ప్రారంభ పూజ, ఘటాస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. అలాగే మొదటి రోజును తెలుపు రంగుకు అంకితం ఇచ్చారు. నవరాత్రుల్లో మొదటి రోజు అనగా సెప్టెంబర్ 26న తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. మహిళలకు ఆకట్టుకునే వస్త్రాలు తెలుపు చాలానే ఉంటాయి.. అమ్మవారు శైలపుత్రి రూపంలో దర్శనమిస్తారు.

తెలుపు రంగు వస్త్రం సమర్పించాలి. ఈ తెలుపు రంగు శాంతి, ప్రశాంతత, స్వచ్ఛతను సూచిస్తుంది.. అందుకే ప్రజలు తెలుపు వస్త్రాలను ధరించి అమ్మను పూజిస్తారు.. ఒక్కో రోజు ఒక్కో అలంకరణ లో చెయ్యడం మాత్రమే కాదు.. ఒక్కో రోజు నైవెద్యం కూడా మారుతుంది..ఈ నవరాత్రుల లో పిల్లలు లేని వారంతా అమ్మవారికి ముడుపులు కట్టి,ప్రత్యేక పూజలు చేస్తారు.అలా చెయ్యడం వల్ల అమ్మవారు సంతాన భాగ్యాన్ని కలిగిస్తుందని భక్తుల విశ్వాసం..

Read more RELATED
Recommended to you

Exit mobile version