కరోనా వ్యాక్సిన్ పై ప్రయత్నాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పదికి పైగా కంపెనీలు వ్యాక్సిన్ పై పనిచేస్తున్నాయి. ప్రస్తుతం మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో వ్యాక్సిన్ వస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 2021సంవత్సరం మార్చి నాటికి కరోనా వైరస్ కి వ్యాక్సిన్ వచ్చేస్తుందని అంటున్నారు. ఐతే వ్యాక్సిన్ వస్తుంది సరే, మొదటగా ఏ దేశాల వారికి దానిని సరఫరా చేస్తారనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. వ్యాక్సిన్ కనిపెట్టిన దేశం వారు వారి ప్రజలకి ఇచ్చిన తర్వాతే మిగతా వారికి ఇస్తారనే ప్రచారం జోరుగా ఉంది.
ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ నేషనలైజంపై డబ్ల్యూ హెచ్ వో ఛీఫ్ ట్రెండన్ అదనామ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక దేశ ప్రజలకే వ్యాక్సిన్ సరఫరా చేయడం సరికాదని, దానివల్ల సమస్య తొలగిపోదని, ఇంకా పెరుగుతుందని సూచించాడు. బీద దేశాల నుండి అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలకి కూడా వ్యాక్సిన్ సరఫరా చేయాల్సి ఉంటుందని, అందరికీ కొంత కొంత మేర సరఫరా అందిస్తేనే బాగుంటుందని చెబుతున్నాడు. ఈ మేరకు వ్యాక్సిన్ నేషనలిజంపై మాట్లాడాడు. ప్రపంచ ప్రజలందరి ప్రాణాలు ఒకటే అనీ, ఏ దేశానికి ఆ దేశ ప్రజల ప్రాణాలు ముఖ్యమే అనీ, అలాగనీ వ్యాక్సిన్ నేషనలిజం కరెక్ట్ కాదని అంటున్నాడు.