గిన్నిస్ రికార్డు సృష్టించిన హైదరాబాద్ బంగారు వ్యాపారి..

-

హైదరాబాదుకి చెందిన శ్రీకాంత్ అనే బంగారు ఆభరణాల తయారీదారుడు గిన్నీసు రికార్డు సృష్టించాడు. 7801వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని తయారు చేసి ఈ రికార్డు సృష్టించాడు. ఈ ఉంగరానికి బ్రహ్మ కమలం అనే పేరు పెట్టాడు. పవిత్ర హిమాలయాల్లో దొరికే బ్రహ్మ కమలం అనే పుష్పం పేరుతో తయారు చేసిన ఈ ఉంగరాన్ని చేయడానికి 11నెలల సమయం తీసుకున్నాడు. కమలానికి ఉండే రేకుల్లాంటి భాగాలన్నింటినీ వజ్రాలతో నింపేసి అందంగా తీర్చిదిద్దాడు.

దక్షిణ భారత దేశం నుండి బంగారు ఆభరణాల తయారీలో ఇదే మొట్ట మొదటి గిన్నీస్ రికార్డు. ఈ మేరకు శ్రీకాంత్ మాట్లాడుతూ, గిన్నిస్ వరల్డ్ రికార్డు వారికి ధన్యవాదాలు తెలిపాడు. బంగారు ఆభరణాల తయారీలో తన ప్రతిభని గుర్తించినందుకు సంతోషం వ్యక్తం చేసాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version