వుహాన్ ల్యాబ్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిప్పులు.. భద్రతా ప్రమాణల్లో ఫెయిల్.

-

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పుట్టుక గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. వుహాన్ ల్యాబ్ లో కరోనా పుట్టిందంటూ వచ్చిన ఆరోపణలను ఖండించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆ తర్వాత దర్యాప్తు చేపట్టడానికి ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో సంస్థ బృందం, చైనాలోని వుహాన్ కు చేరుకుంది. వుహాన్ ల్యాబ్ ను పరిశీలించిన బృందం, భద్రతా ప్రమాణాల విషయంలో నిప్పులు చెరిగింది. ఎలాంటి నైపుణ్యం, భద్రతా ప్రమాణాలు పాటించకుండానే వుహాన్ ల్యాబ్ లో పరిశోధనలు జరిగాయని అన్నారు.

వుహాన్ మార్కెట్లో జంతువులకు, మనుషులకు మధ్య కాంటాక్ట్ చాలా దగ్గరగా ఉందని, అదీగాక సముద్ర జంతువుల మార్కెట్ కు 500మీటర్ల దూరంలో ఈ ల్యాబ్ ఉందని, గబ్బిలాల నుండి నమూనాలు సేకరించేటపుడు ఈ వైరస్, ల్యాబ్ సిబ్బందికి సోకే అవకాశం లేకపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం తెలిపింది. ప్రస్తుతం దీనిపై ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉందని, పూర్తి సమాచారం మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version