ఏపీ భవిష్యత్తు ని నాశనం చేస్తోంది ఎవరు?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తీరు చాలా అన్యాయం తో కూడిన పని అంటూ పార్లమెంటులో ఇటీవల ప్రధాని మోడీ మరియు అమిత్ షా తెలపడం జరిగింది. అటువంటి అన్యాయానికి గురి అయ్యి విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికి రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. మొదటిసారి తెలుగుదేశం పార్టీ గెలవగా రెండోసారి వైసిపి పార్టీ గెలిచింది.

అయితే ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్లమెంటు సాక్షిగా విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హక్కును కేంద్రం దగ్గర నుండి రాష్ట్రానికి రాబట్టడంలో రెండు పార్టీలు ఫెయిల్ అయ్యాయని తాజాగా తేలిపోయింది. కేవలం ఈ రెండు పార్టీలు తమ ప్రయోజనం కోసం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని చాలామంది రాజకీయ మేధావులు విమర్శిస్తున్నారు.

జాతీయ పార్టీలు విభజించి ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చెయ్యగా ఆంధ్ర లోనే పుట్టిన వైసిపి, టిడిపి పార్టీలు పరిపాలించిన రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయని రెండిటికి రెండు పార్టీలు ఎవరు న్యాయం చేయలేక పోయారని రాజకీయ మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు పరిపాలన లో ఏవిధంగా ఉందో ప్రస్తుత పరిపాలన కూడా ఆ విధంగానే ఉందని విమర్శిస్తున్నారు. రాష్ట్రం బాగు పడాలి అంటే కచ్చితంగా కేంద్రాన్ని నిలదీసే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ ఉండాలని…కానీ ఆ లక్షణం వైసీపీ మరియు టీడీపీ పార్టీలో లేదని పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version