సుదీర్ఘానుభవం మరియు చరిత్ర ఉన్న కాంగ్రెస్ కు ఇవాళ గత్యంతరం లేని పరిస్థితులు కొన్ని వెన్నాడుతున్నాయి. దక్షిణాదిలో కాంగ్రెస్ కోలుకోవడంలో చాలా అంటే చాలా వెనుకబడి ఉంది. ఇదే సమయంలో కాస్తో కూస్తో పట్టున్న ఉత్తరాది కూడా హస్తం పార్టీ నుంచి చే జారిపోతోంది. మరి! త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఏడు విడతల ఎన్నికలకు స్టార్ క్యాంపైనర్ ఎవరో?
కాంగ్రెస్ పార్టీకి సీనియర్లు ఉన్నారు. వందేళ్లు దాటిన పార్టీకి జూనియర్లు కూడా ఉన్నారు. సీనియర్ మరియు జూనియర్ వివాదంలో చాలా జరుగుతున్నాయి కూడా! అయినా ఇవేవీ పట్టించుకోకుండా రోజూ కాంగ్రెస్ బాగుపడుతుందన్న అపోహ ఒకటి ఉంది. కానీ కాంగ్రెస్ బాగు పడినా బాగుపడక పోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ తమ జీవితంలో కాంగ్రెస్ ఎదుగుదలకు తానే కారణం అని రాహుల్ కానీ సోనియా కానీ అనుకోవడంలో కూడా తప్పేం లేదు కానీ జరుగుతుందా అన్నదే ఓ సంశయం. ఎందుకంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఉన్నపళాన ఎదగాలంటే చాలా కష్టాలు దాటుకుని రావాలి. రాజకీయంలో రాజీ లేని పోరు సాగించాలి.
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి జవం జీవం నింపిన సోనియా ఇప్పుడు చాలా పెద్ద వారు అయిపోయారు.అంతేకాదు ఆమె మాట కూడా చాలా మంది సీనియర్లు వినడం లో వెనుకంజలోనే ఉన్నారు. ఎందుకు వచ్చిన గొడవ అని సోనియా సైలెంట్ అయిపోవడం మినహా కపిల్ సిబల్ లాంటి లీడర్లను వ్యతిరేకించి ఆమె చేసిందేమీ లేదు. ఏ మాటకు ఆ మాట కాంగ్రెస్ లో ఇప్పటికిప్పుడు న్యాయ పరమైన మార్పులు రావు. అలానే సంస్థాగత మార్పులు అంతకన్నా రావు. సంస్థాగత మార్పులు రావాలంటే కాంగ్రెస్ ఇప్పటి కన్నా బాగా పనిచేయగలగాలి. లేదా ఉన్న సీనియర్లలో పనిచేసే వాళ్లనే ఉంచుకుని ఇతరులను పక్కనబెట్టి పార్టీ పదవులు కేటాయించి సంస్కరణ బాట పట్టాలి.ఇవన్నీ సోనియాతో అవుతాయా ? లేదా రాహుల్ తో అవుతాయా? అన్నదే ఓ పెద్ద సంశయం.ఈ క్రమంలో ఆ పార్టీ పెద్ద దిక్కును వెతుక్కుంటోంది. ఆ పెద్ద దిక్కు ఎవరన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.. వంద పేజీల ఆన్సర్ షీట్ కూడా!