క‌రోనా ప‌రీక్ష‌ల్లో నిర్ల‌క్ష్యం వద్దు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చ‌రిక

-

కరోనా థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా భారీగా పెరిగిన కేసులు ప్ర‌స్తుతం కాస్త త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. దీంతో ప‌రీక్ష‌లు చేయ‌డంలో నిర్ల‌క్ష్యం క‌నిపిస్తోంది. ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం మంచిది కాద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. ముఖ్యంగా వైర‌స్ ఎక్క‌డ ఎలా ఉంది..? ఎలా రూపాంత‌రం చెందుతుంద‌నే విస‌యాల‌ను తెలుసుకోవ‌డం ద్వారా వైర‌స్ క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు అని డ‌బ్ల్యూహెచ్ఓ సాంకేతిక విభాగాధిప‌తి మ‌రియా వాన్ కెర్ఖోవ్ పేర్కొన్నారు. ప్ర‌పంచ వ్యాప్తం క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు ఒక్క‌సారిగా ప‌డిపోయిన‌ట్టు తాము గుర్తించామ‌న్నారు. ఓ వ్య‌క్తికి వైర‌స్ సోకింద‌ని తెలిసేందుకు అత‌నికి వైద్యం అందిచేందుకు క‌చ్చితంగా ప‌రీక్ష‌లు చేయాల్సిందే అని ఆమె వెల్ల‌డించారు.

అందుకే క‌రోనా ప‌రీక్ష‌ల‌లో నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ద అని కోరారు. వినియోగానికి వీలుగా, వేగంగా ఫ‌లితాల‌ను చూపించే నాణ్య‌మైన కిట్‌ల‌ను ఉప‌యోగించాల‌న్నారు. ఒమిక్రాన్ చివ‌రిది కాద‌ని, మ‌రింత ప్ర‌మాదక‌ర‌మైన‌వేరియంట్లు పుట్టుకొచ్చే అవ‌కాశం ఉంద‌ని మ‌రియా హెచ్చ‌రించారు. కొత్త వేరియంట్‌ల‌ను వైల్డ్ కార్డు ఎంట్రీగా ఆమె తెలిపారు. ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్ BA-1 కంటే తాజాగా వెలుగులోకి వ‌చ్చి స‌బ్ వేరియంట్ BA-2 మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతుంతోంద‌ని వెల్ల‌డించారు. ఒమిక్రాన్ త‌రువాత మ‌రొక వేరియంట్ వ‌స్తే అది ఇంకా ఎక్కువ శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను క‌లిగి ఉండే అవ‌కాశం ఉంద‌ని ఆమె పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version