అందుకే అభినందన్ ను పాక్ ఆలస్యంగా అప్పగించిందా?

-

పాక్ చెరలో చిక్కిన ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శుక్రవారం రాత్రి భారత్ లో అడుగుపెట్టారు. అయితే.. శుక్రవారం సాయంత్రమే అభినందన్ ను భారత్ కు అప్పగిస్తామన్న పాక్.. ఎందుకు అభినందన్ విడుదలను ఆలస్యం చేసింది. ప్రతి భారతీయుడిని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఎందుకు.. ఎందుకు కావాలని అభినందన్ విడుదలను ఆలస్యం చేసింది పాక్. దీంట్లో ఏదన్నా మతలబు ఉందా? పదండి తెలుసుకుందాం.

అభినందన్ భారత్ లో అడుగుపెట్టడానికి ఒక గంట ముందు పాకిస్థాన్.. అభినందన్ కు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఐఏఎఫ్ జీ సూట్ లో అభినందన్ ఉన్నారు. ఆ వీడియో పాకిస్థాన్ తనను ఎలా ట్రీట్ చేసింది… అక్కడ ఆయనకు ఎదురైన అనుభవాలతో ఉంది. పాకిస్థాన్ ఆర్మీని ఆయన పొగుడుతూ ఉన్న వీడియో అది. అయితే.. ఆ వీడియో ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే.. ఆ వీడియోను ఎడిట్ చేసి మరీ.. చాలా కట్ లతో పాక్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. అభినందన్ తో ఆ వీడియోను తీయడానికే ఆయన్ను రిలీజ్ చేయకుండా చాలాసేపు ఆపినట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్ అభినందన్ కు ఎటువంటి హానీ తలపెట్టలేదని.. అభినందన్ ను మంచిగానే చూసుకున్నామని.. ప్రపంచానికి తెలియడం కోసమే.. పాక్ ఇలా అభినందన్ తో వీడియో రూపొందించి విడుదల చేసి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అభినందన్ ను శుక్రవారం సాయంత్రమే లాహోర్ కు తీసుకొచ్చి.. అక్కడ ఐఎస్ఐ కార్యాలయంలో గంటపాటు ఉంచారట. అక్కడే అభినందన్ పై వీడియో చిత్రీకరించారట. అంతే కాదు.. అభినందన్ తో రాతపూర్వకంగా స్టేట్ మెంట్ కూడా తీసుకున్నారట. ఇవన్నీ చేయడంలో ఆలస్యం కావడం వల్లే ఆయన వాఘా బార్డర్ రావడానికి చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు… రాత్రి 9.25 గంటలకు అభినందన్ భారత గడ్డపై అడుగుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version