ఆఫ్గానీయులకు ఆ నంబర్ ని చూస్తే భయమెందుకో..!

-

చాలా మందికి కారు కొని లాంగ్ డ్రైవ్ లను షికారుకు వెళ్లాలని ఆశ ఉంటుంది. నచ్చిన కారు వచ్చినప్పుడు కారు నంబర్ ప్లేట్ పై నచ్చిన నంబర్ ఉండాలని భావిస్తుంటారు. ఆ నంబర్ దక్కించుకునేందుకు ఆర్టీఓ కార్యాలయాల చుట్టు తిరిగి నంబర్ ను దక్కించుకుంటారు. అయితే వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే రోడ్డు ట్రాన్స్ పోర్టు సంస్థ నంబర్ కేటాయిస్తుంది. ఒకవేళ ఆ నంబర్ నచ్చకపోతే వాహనదారులు డబ్బులు చెల్లించి నంబర్ మార్చుకోవచ్చు.

afghan-39

కానీ, అప్గానిస్థాన్ లో దీనికి భిన్నంగా జరుగుతోంది. అఫ్గానీయులకు ఏ నంబర్ వచ్చినా పర్వాలేదు కానీ.. ‘36’ నంబర్ మాత్రం రావొద్దని అనుకుంటారంట. స్వయంగా వారే ఆర్టీఓ అధికారుల దగ్గరికి వెళ్లి 39 నంబర్ ఇవ్వకండని వేడుకుంటారు. గత కొన్నేళ్లుగా అఫ్గానీయులు ఈ నంబర్ ని చూస్తేనే భయపడుతున్నారు. దీంతో ఆ దేశ ప్రభుత్వం 39 సిరీస్ నంబర్లనే తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ నంబర్ అంటే వీరికి ఎందుకంత భయమే తెలుసుకుందాం రండి.

అఫ్గానిస్థాన్ లో ‘39’ నంబర్ తో వాహనాలు కానీ, మొబైల్ నంబర్ కనిపించినా వారికి తీవ్ర అనుమానాలు ఎదురవుతాయట. ఎందుకంటే అక్కడి ప్రజలకు 39 నంబర్ చూస్తూ అసహ్యం వేస్తుందంట. దీనిపై పలు వాదనలు కూడా ఉన్నాయి. దేశంలోని హేరట్ అనే నగరంలో వ్యభిచార కేంద్రాలను నిర్వహించే ఓ క్రూరమైన వ్యక్తి ఉన్నాడట. అతడిని స్థానికులు ‘39’ నంబర్ తో పిలుస్తుంటారు. అతడు వినియోగించే కార్ల నంబర్ ప్లేట్ లో కూడా 39 ఉంటుంది. అయితే అఫ్గానిస్థాన్ లో వ్యభిచార నిర్వహణ, వేశ్యగా మారడం అక్కడి నిబంధనలకు విరుద్ధం. దీంతో వ్యభిచారం నిర్వహించే వారు ఉపయోగిస్తున్న కార్ల నంబర్లను సామాన్య ప్రజలు వినియోగించడానికి ఇష్టపడరు.

39 నంబర్ ఉన్న కార్లలో అమ్మాయిలు వెళ్తే ఆకతాయిలు వెంటపడటం, దూషించడం చేస్తుంటారట. అలా ఆ నంబర్ ను అసహ్యించుకోవడం.. హేరట్ నగరం నుంచి దేశవ్యాప్తంగా వ్యాపించింది. 39 నంబర్ కలిగి ఉన్నవారు వ్యభిచారం చేసేవాళ్లుగా భావిస్తుంటారు. అందుకే అక్కడి ప్రజలు ఆ నంబర్ ను ఇష్టపడరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version