ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితుల ఆధారంగా చూస్తే కొన్ని కొన్ని అంశాల్లో ముఖ్యమంత్రి జగన్ ఆర్థికంగా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమస్యలతో ఎక్కువగా ఉంది అనే విషయం అందరికీ స్పష్టంగా అర్థం అవుతుంది. అయినా సరే ఈ సమస్యను పరిష్కరించే విషయంలో సీనియర్ నేతల నుంచి సలహాలు ముఖ్యమంత్రి జగన్ కు రావడం లేదు. అయితే తిరుపతి ఎన్నికల తర్వాత ఆర్థిక శాఖలో కచ్చితంగా జగన్ మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
తెలంగాణకు చెందిన కొంతమంది మాజీ అధికారులతో ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ చర్చలు జరుపుతున్నారు. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి కొంత మంది సలహాలు తీసుకుని ముఖ్యమంత్రి జగన్ ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే కొంతమంది కీలక నేతలతో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు చెందిన మాజీ అధికారులు తమకు సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది.
మరి ఈ విషయంలో ఏం జరగబోతుంది ఏంటి అనేది చూడాలి. అయితే ప్రస్తుత పరిస్థితులు మాత్రం ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా మారే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బంది పడటం తో కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా సహకరించడం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు తీసుకోవడంతో కేంద్రం నుంచి సహకారం రాకపోవచ్చు. అందుకే ఈ విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి కొన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు.